రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఏబీ డివిలియర్స్‌ను(AB De Villiers News) వచ్చే ఏడాది కూడా తమ జట్టుతోనే అట్టిపెట్టుకోకూడదని అభిప్రాయపడ్డాడు టీమ్ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్(Gambhir on RCB). ఈ సీజన్లో జట్టు తరఫున అత్యధిక స్కోరు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను(Gambhir on Maxwell) కొనసాగించాలని సూచించాడు.
"ఆర్సీబీ జట్టులో రానున్న రోజుల్లో మరింత రాణించే ఆటగాడు డివిలియర్స్ కాదు. ఇది మ్యాక్స్‌వెల్‌తో సాధ్యమవుతుంది" అని గంభీర్ తెలిపాడు.
దక్షిణాఫ్రికా మాజీ సారథి ఏబీ డివిలియర్స్(AB De Villiers RCB) 2011 నుంచి ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు అతడు 184 మ్యాచ్‌లు ఆడి 5162 పరగులు చేశాడు. ఈ సీజన్లో మాత్రం 313 పరుగులే చేశాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన అనంతరం డివిలియర్స్ టీ20 టోర్నీలు ఆడిన సందర్భాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో గంభీర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
మెగావేలానికి ముందు.. మ్యాక్స్‌వెల్, కోహ్లీ, యుజ్వేంద్ర చాహల్‌ను ఆర్సీబీ తమతోనే అంటిపెట్టుకోవాలని గంభీర్ సూచించాడు.
ఇదీ చదవండి: