చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. చెన్నై నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాజస్థాన్ జట్టులో యశస్వీ జైశ్వాల్ (50: 21 బంతుల్లో 4X6, 3X6) శివమ్ దూబే(64: 42 బంతుల్లో 4X6, 4X6 ) ధాటికి భారీ లక్ష్యం చిన్నదైంది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (101: 60 బంతుల్లో 9x4, 5x6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆఖర్లో వచ్చిన రవీంద్ర జడేజా (32: 15 బంతుల్లో 4x4, 1x6) దూకుడుగా ఆడాడు.
చెన్నై బ్యాటర్లు చివరి ఓవర్లలో రెండు ఫోర్లు, రెండు సిక్సులు సహా 22 పరుగులు రాబట్టారు. రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా మూడు, చేతన్ సకారియా ఒక వికెట్ తీశాడు.
ఇదీ చూడండి: IPL 2021: 'వార్నర్లానే రైనానూ పక్కనపెట్టేయొచ్చు'