బయో బబుల్‌తో విసిగిపోయి ఐపీఎల్‌ను వీడిన ఇంగ్లాండ్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ గెరాల్డ్ కోజీని జట్టులోకి తీసుకుంది. 20 ఏళ్ల ఈ దక్షిణాఫ్రికా పేసర్ ఇప్పటివరకు 8 టీ20 మ్యాచ్‌ల్లో ఆడాడు. దక్షిణాఫ్రికా తరఫున రెండుసార్లు అండర్-19 ప్రపంచకప్‌లో ప్రాతినిధ్యం వహించాడు.
ఏ ఫ్రాంఛైజీలో లేని విధంగా రాజస్థాన్ జట్టును నలుగురు విదేశీ ఆటగాళ్లు దూరమయ్యారు. బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ గాయాల కారణంగా లీగ్‌ను విడిచిపెట్టారు.
ఇవీ చదవండి: అడ్డంకులున్నా ఆగని ఒలింపిక్ జ్యోతియాత్ర