ETV Bharat / sports

'పంత్​లో కోహ్లీ, విలియమ్సన్ కనిపిస్తున్నారు' - కోహ్లీ పంత్ విలియమ్సన్

పంత్​ కీపర్​గా మెరుగుపడితే మరో పది పన్నేండేళ్లు తిరుగుండదని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అతడిలో స్టార్ క్రికెటర్లు ఇద్దరు కనిపిస్తున్నారని చెప్పాడు.

Pant win you matches like Kohli and Williamson: Ponting
'పంత్​లో కోహ్లీ, విలియమ్సన్ కనిపిస్తున్నారు'
author img

By

Published : Apr 14, 2021, 10:13 PM IST

యువ క్రికెటర్ రిషభ్ పంత్​లో స్టార్ ఆటగాళ్లు కోహ్లీ, విలియమ్సన్ కనిపిస్తున్నారని దిల్లీ క్యాపిటల్స్​ కోచ్​ పాంటింగ్ అన్నాడు. అలానే కీపింగ్​లో మెరుగుపడితే మరో 10-12 ఏళ్లు టీమ్​ఇండియా తరఫున ప్రధాన వికెట్​కీపర్​గా అతడే కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు. దీనితో పాటు పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.

"పంత్​ దూకుడులో కోహ్లీ, కెప్టెన్సీలో విలియమ్సన్ కనిపిస్తున్నాడు. ఐపీఎల్​ పంత్​ బ్యాటింగ్​ స్థానంపై మాకు స్పష్టత లేదు. కానీ నాలుగు, ఐదు స్థానాలు అతడికి సరిపోయినట్లుంది. బ్యాటింగ్​లో బాగా ఆడుతున్నప్పటికీ, కీపింగ్​ చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నాడు. వాటిని సరిచేసుకుంటే టీమ్​ఇండియాకు మరో 10-12 ఏళ్లు ప్రధాన వికెట్ కీపర్ అతడే" అని పాంటింగ్ చెప్పాడు.

pant team india
పంత్

శ్రేయస్​ అయ్యర్​కు భుజం గాయం కావడం వల్ల అతడు ఈ సీజన్​ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో పంత్​కు సారథ్య బాధ్యతలు అప్పగించింది దిల్లీ ఫ్రాంచైజీ. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్​లో విజయం సాధించింది. రాజస్థాన్​ రాయల్స్​తో గురువారం జరగబోయే మ్యాచ్​కు సిద్ధమవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.