ETV Bharat / sports

ఐపీఎల్-14లో శ్రీశాంత్​కు నిరాశ - వేలంలో దక్కని చోటు - indian premier league

ఐపీఎల్​ 14వ సీజన్​ వేలం జాబితాలో ఫాస్ట్​ బౌలర్​ శ్రీశాంత్​కు చుక్కెదురైంది. ఏ ఒక్క ఫ్రాంచైజీ అతని పేరును తుది జాబితాలోకి తీసుకోలేదు. ఈ నెల 18న చెన్నై వేదికగా ఆటగాళ్ల వేలం జరుగనుంది.

No Sreesanth for IPL 2021 auctions as 292 cricketers to go under hammer
ఐపీఎల్-14కు శ్రీశాంత్​ దూరం- వేలంలో దక్కని చోటు
author img

By

Published : Feb 12, 2021, 10:27 AM IST

ఈ నెల 18న జరిగే ఐపీఎల్​ వేలం కోసం ప్రకటించిన తుది జాబితాలో ఫాస్ట్​ బౌలర్​ శ్రీశాంత్​కు చోటు దక్కలేదు. 8 ఫ్రాంచైజీల్లో ఏ ఒక్కటి అతడి పేరును పరిగణలోకి తీసుకోలేదు.

ఐపీఎల్​ 2021 వేలం కోసం 1,114 మంది ఆటగాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. అందులో నుంచి 292 మందిని తుది జాబితాలో చోటు కల్పించారు. ఇందులో 164 మంది భారత ఆటగాళ్లు కాగా.. 125 మంది విదేశీ క్రీడాకారులు. మరో ముగ్గురు అసోసియేటేడ్​ నేషన్స్​ ప్లేయర్స్.

అత్యధిక విలువ అయిన రూ.2 కోట్ల జాబితాలో హర్భజన్​ సింగ్​, కేదార్​ జాదవ్​, గ్లెన్​ మాక్స్​వెల్​, స్టీవ్​ స్మిత్​, షకిబుల్​ హసన్​, మొయిన్​ అలీ, సామ్​ బిల్లింగ్స్​, లియమ్​ ప్లంకెట్​, జేసన్​ రాయ్​, మార్క్​ వుడ్​లు ఉన్నారు.

భారత మాజీ క్రికెటర్​ సచిన్​ కుమారుడు అర్జున్​ తెందూల్కర్​ రూ.20 లక్షల కనీస వేలం జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఛెతేశ్వర్​ పుజారా, మార్న్స్​ లబుషేన్​లు సైతం రూ.1.5 కోట్ల జాబితాలో ఉన్నారు.

ఆర్​సీబీ జట్టుకు అత్యధికంగా 13 మంది ఆటగాళ్లను కొనుక్కునే వీలుండగా.. సన్​రైజర్స్​ టీమ్​కు ముగ్గురిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: క్రికెట్​ బంతుల కథ.. ఓ సారి చూద్దామా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.