కొవిడ్ కారణంగా తాత్కాలికంగా ఐపీఎల్‌కు దూరమైన దిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ఆ జట్టు ప్రత్యామ్నాయాన్ని ప్రకటించింది. ఈ లీగ్‌లోనే తొలిసారిగా కొవిడ్ తాత్కాలిక ఆటగాడిగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షామ్స్ ములానిని దిల్లీ జట్టులో చేర్చింది. అతడు అక్షర్ కోలుకుని జట్టులోకి వచ్చే వరకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. ముంబయికి చెందిన 24 ఏళ్ల ములాని.. ఇప్పటిదాకా 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు తీశాడు. 556 పరుగులు కూడా చేశాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్: పంజాబ్‌పై చెన్నై విజయం సాధిస్తుందా?
ఈ లీగ్‌కు ముందు క్వారంటైన్లో ఉన్న సమయంలోనే అక్షర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. 12 రోజులు గడిచినా అతడింకా కోలుకోకపోవడం వల్ల ములాని రూపంలో ప్రత్యామ్నాయాన్ని ప్రకటించింది దిల్లీ క్యాపిటల్స్ జట్టు యాజమాన్యం. గాయంతో ఈ టోర్నీ మొత్తానికి దూరమైన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్థానంలో కర్ణాటక ఆల్‌రౌండర్ అనిరుద్ధ జోషి డీసీ బృందంలో చేరాడు. జోషి.. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మాత్రమే కాక ఆఫ్‌స్పిన్నర్ కూడా.
ఇదీ చదవండి: టేబుల్ టెన్నిస్‌లో భారత కుర్రాడి సత్తా