ETV Bharat / sports

డికాక్​ మెరుపు ఇన్నింగ్స్​.. రాజస్థాన్​పై ముంబయిదే విజయం

author img

By

Published : Apr 29, 2021, 7:23 PM IST

రాజస్థాన్​ రాయల్స్​ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్​ 18.3 ఓవర్లలో ఛేదించి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో టోర్నీలో మూడో విజయాన్ని అందుకున్న రోహిత్​ సేన.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Mumbai Indians vs Rajasthan Royals
ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్

దిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ ఘనవిజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో ఛేదించి గెలుపును సొంతం చేసుకుంది. ఓపెనింగ్​ భాగస్వామ్యంలో కెప్టెన్​ రోహిత్​ శర్మ(14) వెంటనే పెవీలియన్​ చేరినా.. మరో బ్యాట్స్​మన్​ క్వింటన్ డికాక్​(70) ఆచిచూచి చివరి వరకు ఆడుతూ నాటౌట్​గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన సూర్య కుమార్​ యాదవ్​(16), క్రునాల్​ పాండ్యా(39) ఫర్వాలేదనిపించారు. దీంతో మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న ముంబయి ఇండియన్స్​ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగుల స్కోర్‌ సాధించింది. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌(41; 32 బంతుల్లో 3x4, 3x6), యశస్వీ జైశ్వాల్‌(32; 20 బంతుల్లో 2x4, 2x6) శుభారంభం చేశారు. ఇద్దరూ తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దరినీ రాహుల్‌ చాహర్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌ పంపాడు. 8వ ఓవర్‌లో బట్లర్‌ను స్టంపౌట్‌ చేసిన ముంబయి స్పిన్నర్‌ తన తర్వాతి ఓవర్‌లో యశస్విని క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌ చేశాడు.

అప్పటికి రాజస్థాన్‌ పది ఓవర్లకు 91/2తో మెరుగైన స్థితిలోనే ఉంది. ఆపై కెప్టెన్‌ సంజూ శాంసన్‌(42; 27 బంతుల్లో 5x4), శివమ్‌దూబె(35; 31 బంతుల్లో 2x4, 2x6) రాణించినా చివర్లో ధాటిగా ఆడే క్రమంలో ఔటయ్యారు. బౌల్ట్‌ సంజూను బౌల్డ్‌ చేయగా దూబెను బుమ్రా బుట్టలో వేసుకున్నాడు. చివరికి డేవిడ్‌ మిల్లర్‌(7), రియాన్‌ పరాగ్‌(8) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

ఇదీ చూడండి.. రాజస్థాన్ రాయల్స్ ఉదారత.. కరోనా బాధితులకు విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.