Mandeep Singh Equals Rohit: ఐపీఎల్లో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు మన్‌దీప్ సింగ్. అత్యధికసార్లు డకౌటైన క్రికెటర్ల జాబితాలో.. ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ సరసన నిలిచాడు. ఈ ఇరువురూ.. ఇండియన్ టీ-20 లీగ్‌లో 14 సార్లు పరుగులేమ చేయకుండానే వెనుదిరిగారు. వీరే తొలిస్థానంలో ఉన్నారు. మే 5న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్లోనే డకౌట్ అయ్యాడు మన్‌దీప్. ఈ జాబితాలో రహానె, పార్థివ్ పటేల్, అంబటి రాయుడు, హర్భజన్ సింగ్, పీయుష్ చావ్లా 13 సార్లు డకౌటయ్యారు.
గురువారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ 186/8 పరుగులు చేసింది. పూరన్(62) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే అతడికి మిగతా బ్యాటర్ల నుంచి అతడికి సహకారం లభించలేదు. దీంతో 21 పరుగుల తేడాతో ఓటమి పాలైన సన్‌రైజర్స్.. వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (92; 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడగా.. రోమన్ పొవెల్ (67; 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. దిల్లీ మిగతా బ్యాటర్లలో రిషభ్ పంత్ (26) పరుగులు చేయగా.. మిచెల్ మార్ష్ (10), మన్‌దీప్ సింగ్ (0) డకౌట్ అయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, సీన్ అబాట్, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ తీశారు.
ఇవీ చూడండి: IPL 2022: కోహ్లీ, రోహిత్ వైఫల్యానికి కారణాలివేనా?