ETV Bharat / sports

KKR Vs SRH: కోల్​కతా విజయం.. ప్లేఆఫ్స్​ రేసులో ముందంజ - kolkata knight riders won the match

సన్​రైజర్స్ హైదరాబాద్​​పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది కోల్​కతా నైట్​రైడర్స్. శుభ్​మన్ అర్ధసెంచరీతో రాణించాడు.

kkr vs srh
kkr vs srh
author img

By

Published : Oct 3, 2021, 10:59 PM IST

Updated : Oct 3, 2021, 11:20 PM IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ (57) అర్థ శతకంతో రాణించాడు. నితీశ్ రాణా (25) ఫర్వాలేదనిపించాడు. ఆఖర్లో వచ్చిన దినేశ్‌ కార్తిక్ (18), ఇయాన్ మోర్గాన్ (2) జట్టుని విజయ తీరాలకు చేర్చారు. వెంకటేశ్ అయ్యర్‌ (8), రాహుల్ త్రిపాఠి (7) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. హైదరాబాద్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్ రెండు‌, రషీద్‌ ఖాన్‌, సిద్దార్థ్‌ కౌల్ తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (26) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అబ్దుల్‌ సమద్‌ (25), ప్రియమ్‌ గార్గ్‌ (21) ఫర్వాలేదనిపించారు. హైదరాబాద్‌ జట్టుకి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. టిమ్‌ సౌథీ వేసిన రెండో బంతికే వృద్ధిమాన్ సాహా (0) ఎల్బీగా వెనుదిరిగాడు. జేసన్ రాయ్‌ (10), అభిషేక్‌ శర్మ (6), రషీద్‌ ఖాన్ (8) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.

జేసన్‌ హోల్డర్ (2) నిరాశ పరిచాడు. కోల్‌కతా బౌలర్లలో టిమ్‌ సౌథీ, వరుణ్‌ చక్రవర్తి, శివమ్‌ మావి తలో రెండు వికెట్లు, షకీబ్‌ అల్ హసన్‌ ఒక వికెట్‌ తీశారు.

ఇదీ చూడండి: RCB vs PBKS: పంజాబ్​పై ఆర్​సీబీ విజయం.. ప్లేఆఫ్స్​ బెర్తు ఖరారు

Last Updated : Oct 3, 2021, 11:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.