కోల్‌కతాతో జరిగిన రెండో టీ20లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులకే పరిమితమైంది. దీంతో ముంబయి 10 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 19.5 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైన అయింది. రసెల్(15/5) రెండు ఓవర్లే బౌలింగ్ చేసి ముంబయిని కట్టడి చేశాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 56 పరుగులు) అర్ధశతకం సాధించగా, కెప్టెన్ రోహిత్ శర్మ(32 బంతుల్లో 43 పరుగలు) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని షకిబ్ విడదీశాడు. 11వ ఓవర్‌లో ఓ చక్కటి బంతితో సూర్యను బోల్తా కొట్టించాడు. తర్వాతి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్(1) విఫలమయ్యాడు. దాంతో ముంబయి 88 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. కాసేపటికే రోహిత్ సైతం ఔటయ్యాడు. తర్వాత హార్దిక్ పాండ్య(15), కృనాల్ పాండ్య(15) కాసిన్ని పరుగులు చేయడంతో ముంబయి స్కోర్ 150 దాటింది. చివరి ఓవర్‌లో రసెల్ మూడు వికెట్లు పడగొట్టాడు.