KL Rahul Lucknow Franchise: పంజాబ్ కింగ్స్ జట్టుకు సారథ్యం వహించిన కేఎల్ రాహుల్.. ఇకపై కొత్త ఫ్రాంచైజీ లఖ్‌నవూ జట్టుకు కెప్టెన్‌గా మారనున్నాడట! త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
మరోవైపు జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్.. లఖ్‌నవూ జట్టు హెడ్‌కోచ్‌గా నియమితులయ్యాడు. ఆండీ ఫ్లవర్ అంతకుముందు పంజాబ్ కింగ్స్ మాజీ అసిస్టెంట్ కోచ్‌గా చేశాడు.
రాహుల్‌ను లఖ్‌నవూ జట్టు సొంతం చేసుకుందా?
KL Rahul Lucknow Team: అయితే ఇదే విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినా.. లఖ్‌నవూ ఐపీఎల్ ఫ్రాంచైజీ రూ. 20కోట్లకు పైనే కేఎల్ రాహుల్‌కు ఆశచూపినట్లు తెలుస్తోంది. సన్‌రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్‌కు రూ.16 కోట్లు ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై ఇప్పటికే పంజాబ్, హైదరాబాద్ జట్లు.. బీసీసీఐకు ఫిర్యాదు చేశాయి. ఆర్పీఎస్జీ గ్రూప్.. తమ ఆటగాళ్లకు ఎర వేస్తుందని ఆరోపించాయి. ఇదే విషయంపై బీసీసీఐ కూడా స్పందించింది. తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు కానీ వెర్బల్ కంప్లైంట్ అందిందని.. దాని ప్రకారం ఈ వ్యవహారంపై దృష్టి సారిస్తున్నామని ఓ అధికారి తెలిపారు.
లఖ్‌నవూ టీమ్ హెడ్‌కోచ్‌గా ఆండీ..
Andy Flower Lucknow Franchise: జింబాబ్వే జట్టు మాజీ సారథి ఆండీ ఫ్లవర్.. లఖ్‌నవూ జట్టు హెడ్‌కోచ్‌గా నియమితులయ్యాడు. ఆండీ ఫ్లవర్ అంతకుముందు పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్‌గా చేశాడు.
లఖ్‌నవూ హెడ్‌కోచ్‌గా నియామకం కావడంపై ఆండీ ఫ్లవర్ హర్షం వ్యక్తం చేశాడు. కొత్త ఫ్రాంచైజీలో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురూచూస్తున్నానని అన్నాడు. భారత్‌లో ఉండటం, ఆడటం, కోచింగ్.. తనకెంతో ఇష్టం అని తెలిపాడు.
రెండు కొత్త జట్లు..
2022 IPL Teams: 2022 ఐపీఎల్ సీజన్లో ఈ సారి 10జట్లు పోటీపడనున్నాయి. లఖ్‌నవూ, అహ్మదాబాద్ జట్లు తొలిసారిగా ఐపీఎల్ బరిలోకి దిగనున్నాయి. లఖ్‌నవూ ఐపీఎల్ జట్టును ఆర్పీఎస్జీ గ్రూప్ కొనుగోలు చేసింది. అయితే ఈ జట్టుకు ఇంకా పేరును ఖరారు చేయలేదు. అయితే డిసెంబరు 25లోగా కొత్త ఫ్రాంచైజీలకు సంబంధించి.. కొత్త సారథి, కోచ్, టైటిల్ స్పాన్సర్లను ప్రకటించాలని ఇదివరకే బీసీసీఐ గడువు ఇచ్చింది.
"అహ్మదాబాద్ ఫ్రాంచైజీతోపాటు లఖ్‌నవూ ఫ్రాంచైజీకు మూడు సైనింగ్లు పూర్తయ్యేవరకు సమయమిస్తాం. ఆ తర్వాత ఆటగాళ్ల వేలం, ఇతర కార్యక్రమాలు జరుగుతాయి" అని బీసీసీఐకు చెందిన ఓ అధికారి తెలిపారు.
ఇదీ చూడండి: మరో టోర్నీలో సింధు ఓటమి.. శ్రీకాంత్‌కు పతకం ఖరారు