కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు(KKR Captain Eoin Morgan) ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా(KKR Fine) విధించారు. గురువారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో(KKR Vs MI) స్లో ఓవర్ రేటుకు కారణమైన కోల్‌కతా కెప్టెన్ మోర్గాన్‌కు రూ.24 లక్షలు జరిమానా ఫైన్ విధించగా.. జట్టులోని మిగిలిన ఆటగాళ్ల నుంచి రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజు నుంచి 25 శాతాన్ని కోత పెట్టారు.
"అబుదాబి వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు స్లోఓవర్ రేటుకు కారణమైంది. ఈ సీజన్లో కేకేఆర్ టీమ్ రెండోసారి ఇలా పాల్పడడం వల్ల ఐపీఎల్ నిబంధనల ప్రకారం కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు రూ.24 లక్షలు.. తుదిజట్టులో ఆడిన ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు నుంచి రూ.6 లక్షల లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతాన్ని జరిమానాగా విధించాం".
- ఐపీఎల్ నిర్వాహకుల ప్రకటన
ముంబయి ఇండియన్స్‌పై గెలుపొందిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. రాహుల్ త్రిపాఠి (74 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (53) వీర విహారం చేయడం వల్ల గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ముంబయిని(KKR Vs MI 2021) చిత్తు చేసింది. 156 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా.. 15.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట ముంబయి 6 వికెట్లకు 155 పరుగులే చేయగలిగింది. డికాక్ (55) టాప్ స్కోరర్. ఫెర్గూసన్ (2/27), నరైన్ (1/20), ప్రసిద్ధ్ కృష్ణ (2/43), వరుణ్ చక్రవర్తి (0/20) ముంబయిని కట్టడి చేశారు.
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు. లీగ్‌లో భాగంగా సెప్టెంబరు 26న చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుతో(KKR Vs CSK) మోర్గాన్ సేన తలపడనుంది.
ఇదీ చూడండి.. IPL 2021: కుర్రాళ్ల ప్రదర్శనతో కోల్‌కతా ప్లేఆఫ్స్ ఆశలు సజీవం!