ETV Bharat / sports

టీమ్​ఇండియా ఫాస్ట్​ బౌలర్​కు కరోనా పాజిటివ్​

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ జట్టుకు ఎంపికైన భారత​ బౌలర్​​ ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని కోల్​కతా ఫ్రాంచైజీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

author img

By

Published : May 8, 2021, 2:48 PM IST

India pacer Prasidh Krishna
పేసర్​ ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా పాజిటివ్​

కోల్​కతా నైట్​ రైడర్స్​ జట్టులోని ఇద్దరు క్రికెటర్లకు కరోనా పాజిటివ్​గా తేలింది.​ గురువారం ఉదయం న్యూజిలాండ్ ఆటగాడు​ టిమ్ సీఫెర్ట్​కు వైరస్​ సోకినట్లు తేలగా, ఇప్పుడు భారత పేసర్​ ప్రసిద్ధ్ కృష్ణ కూడా కొవిడ్ బారిన పడినట్లు నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇప్పటికే ఈ జట్టులోని వరుణ్​ చక్రవర్తి, సందీప్​ వారియర్​.. కరోనా సోకడం వల్ల చికిత్స తీసుకుంటున్నారు.

ప్రసిద్ధ్ కృష్ణ.. త్వరలో జరగబోయే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​, ఇంగ్లాండ్​తో సిరీస్​ కోసం టీమ్​ఇండియా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.

ఇదీ చూడండి: కోల్​కతా ఆటగాడు టిమ్ సీఫెర్ట్​కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.