ETV Bharat / sports

'100 కాదు.. ఇషాంత్​ 150 టెస్టులు ఆడాలి!'

author img

By

Published : Apr 1, 2021, 1:46 PM IST

Updated : Apr 1, 2021, 2:32 PM IST

టీమ్​ఇండియా బౌలర్​ ఇషాంత్​ శర్మ 100వ టెస్టును పూర్తిచేసుకోవడం పట్ల దిల్లీ క్యాపిటల్స్​ స్పిన్నర్​ అమిత్​ మిశ్రా ఆనందం వ్యక్తం చేశాడు. ఇలాగే ఆడుతూ ఇషాంత్​ 150వ టెస్టు మైలురాయికి చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Ishant Sharma will play at least 150 Tests, says Amit Mishra
'100 కాదు.. ఇషాంత్​ 150 టెస్టులు ఆడాలి!'

దిల్లీ క్యాపిటల్స్​ జట్టులోని తన సహచర బౌలర్​ ఇషాంత్​ శర్మ.. టీమ్ఇండియా తరఫున 100 టెస్టులు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నాడు స్పిన్నర్ అమిత్​ మిశ్రా. అతడు ఇలానే మరిన్ని మ్యాచ్​లకు ప్రాతినిధ్యం వహించి టెస్టుల్లో 150 మైలురాయిని చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"నేను, ఇషాంత్​ టీమ్ఇండియా తరఫున ఎన్నోసార్లు కలిసి ఆడాం. ఇషాంత్​ ఇటీవలే తన వందో టెస్టు ఆడాడు. ఈ ఘనతకు అతడిని అభినందించాలి. ఇషాంత్​ మరో 25-30 కంటే ఎక్కువ టెస్టులు ఆడి 150 టెస్టుల మైలురాయిని చేరుకోవాలని కోరుకుంటున్నా. ఇషాంత్​ కచ్చితంగా 150 చేరుకునే వరకు టెస్టులు ఆడాలి".

- అమిత్​ మిశ్రా, దిల్లీ క్యాపిటల్స్​ స్పిన్నర్​

నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో ఇషాంత్​ శర్మ తన వందో టెస్టు మైలురాయిని చేరుకున్నాడు. ఇప్పటివరకు 101 టెస్టులు ఆడిన ఇషాంత్​ శర్మ.. 303 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒకసారి 10 వికెట్లు సాధించగా.. 11 సార్లు 5 వికెట్లు తీశాడు.

ఇషాంత్​ శర్మ, అమిత్​ మిశ్రా.. వీరిద్దరూ ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆర్సీబీ క్యాంప్​లో డివిలియర్స్.. నెట్స్​లో మలన్ సిక్సులు

Last Updated : Apr 1, 2021, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.