ETV Bharat / sports

రాహుల్​, దీపక్ విధ్వంసం​.. రాజస్థాన్​ లక్ష్యం 222

author img

By

Published : Apr 12, 2021, 9:39 PM IST

రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో పంజాబ్ 221​ పరుగులు చేసింది. సారథి కేఎల్​ రాహుల్(91)​, దీపక్​ హుడా(64) అర్ధ సెంచరీలతో మెరిశారు. రాజస్థాన్​ బౌలర్లలో చేతన్​ సాకరియా 3, క్రిస్​ మోరిస్​ 2, రియాన్​ పరాగ్​ ఓ వికెట్​ దక్కించుకున్నారు.

punjab vs rajasthan royals
పంజాబ్​ వర్సెస్​ రాజస్థాన్​ రాయల్స్​

వాంఖడే వేదికగా రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ విధ్వంసం సృష్టించింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఈ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. రాజస్థాన్​ బౌలర్లలో చేతన్​ సాకరియా 3, క్రిస్​ మోరిస్​ 2, రియాన్​ పరాగ్​ ఓ వికెట్​ దక్కించుకున్నాడు.

ఓపెనర్లుగా దిగిన కేఎల్​ రాహుల్​(91) అర్ధ శతకంతో మెరవగా.. మయాంక్​ అగర్వాల్(14) మాత్రం మూడో ఓవర్​లోనే వెనుదిరిగాడు. సకారియా వేసిన ఓవర్​ నాలుగో బంతికి కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో పంజాబ్‌ 22 పరుగుల వద్ద తొలివికెట్‌ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చి క్రిస్​ గేల్​(40పరుగులు 6x2,4x4) ధనాధన్​ బ్యాటింగ్​తో చెలరేగి.. రియాన్​ పరాగ్​ బౌలింగ్​లో స్టోక్స్​ చేతికి క్యాచ్​ ఇచ్చి 89 పరుగులు వద్ద ఔట్​ అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన దీపక్​ హుడా(64) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరు సిక్సులు, నాలుగు ఫోర్లతో సునామీ సృష్టించాడు. చివరకు.. జట్టు స్కోరు 194 పరుగుల వద్ద మూడో వికెట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్​ పూరన్​, జై రిచర్డ్​సన్​ డక్ ఔట్ అయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.