ETV Bharat / sports

ఐపీఎల్: ధర మినిమమ్ కానీ ఆడితే మ్యాక్సిమమ్!

ఐపీఎల్​ 14వ సీజన్​కు ముందు జరిగిన మినీ వేలంలో కొంతమంది దేశవాళీ క్రికెటర్లను కనీస ధరకే కొనుగోలు చేశాయి ఫ్రాంచైజీలు. అయితే ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకోగల సత్తా ఉన్న ఆ ఆటగాళ్లేవరో చూద్దాం.

IPL
ఐపీఎల్
author img

By

Published : Apr 16, 2021, 9:32 AM IST

ఐపీఎల్​ 14వ సీజన్​లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్​లోనే సత్తాచాటాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ బౌలర్ హర్షల్ పటేల్. 27 పరుగులకే 5 వికెట్లు తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ మ్యాచ్​లో ఆర్సీబీ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇతడు ఇంతకుముందు దేశవాళీల్లోనూ మెరిశాడు. 2012 ఐపీఎల్​లో ఆర్సీబీ తరఫున అరంగేట్రం చేశాడు హర్షల్. తర్వాత 2018లో దిల్లీ ఫ్రాంచైజీకి మారాడు. ఈ సీజన్​కు ముందు జరిగిన మినీ వేలంలో తిరిగి ఆర్సీబీ ఇతడిని ట్రేడింగ్ విండో ద్వారా కనీస ధర రూ.20 లక్షలకే కొనుగోలు చేసింది. వారి నమ్మకాన్ని నిలబెడుతూ అంచనాలకు తగ్గట్లు రాణిస్తున్నాడీ యువ పేసర్. అయితే ఈ లీగ్​లో ఇతడితో పాటు ఈసారి మరికొంత మంది ప్రతిభ గల దేశవాళీ క్రికెటర్లు కనీస ధరకే అమ్ముడు పోయారు. వారెవరో చూద్దాం.

మహ్మద్ అజారుద్దీన్ (ఆర్సీబీ)

దేశవాళీల్లో కేరళకు ప్రాతినిధ్యం వహిస్తోన్న అజారుద్దీన్ వికెట్ కీపర్ బ్యాట్స్​మన్​గా రాణిస్తున్నాడు. ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా ముంబయితో జరిగిన మ్యాచ్​లో 37 బంతుల్లోనే సెంచరీ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ టోర్నీలో మొత్తంగా 195 స్ట్రైక్​ రేట్​తో 214 పరుగులు చేశాడు. దీంతో ఆర్సీబీ ఇతడిని కనీస ధరకు కొనుగోలు చేసింది.

సౌరభ్ కుమార్ (పంజాబ్ కింగ్స్)

కొన్నేళ్లుగా దేశవాళీల్లో సత్తాచాటుతున్నాడు ఉత్తరప్రదేశ్​కు చెందిన లెఫ్టార్మ్ పేసర్ సౌరభ్ కుమార్. ఇప్పటివరకు 23.14 సగటుతో 192 ఫస్ట్ క్లాస్ వికెట్లు దక్కించుకున్నాడు. ఇంతకుముందు ఐపీఎల్​లో రైజింగ్ పుణె సూపర్ జైంట్స్​కు ప్రాతనిధ్యం వహించిన ఇతడు ఆ తర్వాత మళ్లీ కాంట్రాక్ట్ దక్కించుకోలేకపోయాడు. తాజాగా ఈ సీజన్​ కోసం ఇతడిని పంజాబ్ కింగ్స్ కనీస ధరకు కొనుగోలు చేసింది.

విష్ణు వినోద్ (దిల్లీ క్యాపిటల్స్)

ఈ సీజన్​కు ముందు జరిగిన మినీ వేలంలో కేరళకు చెందిన వికెట్ కీపర్​ బ్యాట్స్​మన్ విష్ణు వినోద్​ను కనీస ధరకు కొనుగోలు చేసింది దిల్లీ క్యాపిటల్స్. ఈ ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీతో పాటు విజయ్ హజారే ట్రోఫీలో సత్తాచాటాడు విష్ణు. ఇంతకుముందు లీగ్​లో ఆర్సీబీకి ప్రాతనిధ్యం వహించిన ఇతడు మూడు మ్యాచ్​లు కూడా ఆడాడు. ఈసారి దిల్లీ క్యాపిటల్స్​ తుదిజట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.

వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్)

దేశవాళీల్లో 137 స్ట్రైక్​ రేట్​తో బ్యాటింగ్​లో రాణిస్తోన్న వెంకటేశ్ 21 వికెట్లూ దక్కించుకున్నాడు. దీనితో పాటు ఎకానమీ 7 లోపు ఉండటం ఇతడిని ఐపీఎల్​కు ఎంపికయ్యేలా చేసింది. మధ్యప్రదేశ్​కు ప్రాతినిధ్యం వహించిన వెంకటేశ్​ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 198 పరుగులు చేసి, రెండు వికెట్లు కూడా దక్కించుకున్నాడు. అలాగే ముస్తాక్ అలీ టోర్నీలోనూ కొన్ని అద్భుత ఇన్నింగ్స్​లు ఆడాడు. దీంతో ఐపీఎల్​లో కేకేఆర్​ దృష్టిలో పడ్డాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.