ETV Bharat / sports

iPL 2021: అదరగొట్టిన గైక్వాడ్​.. ముంబయి లక్ష్యం 157 - ipl second phase schedule 2021

ఐపీఎల్​ రెండో దశ(ipl second phase schedule 2021) తొలి మ్యాచ్​లో టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న చెన్నై సూపర్​ కింగ్స్​ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లలో బౌల్ట్​, అడం మిల్నే, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు.

csk
సీఎస్కే
author img

By

Published : Sep 19, 2021, 9:23 PM IST

ఐపీఎల్​ రెండో దశ(ipl second phase schedule 2021) తొలి మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ బౌలర్లు​ అదరగొట్టారు. చెన్నై సూపర్​ కింగ్స్​ బ్యాట్స్​మెన్​ను హడలెత్తించారు. సీఎస్కే జట్టులో రుతురాజ్​ గైక్వాడ్​(88*) మినహా అందరూ విఫలమయ్యారు. నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి.. ప్రత్యర్థి జట్టు ముందు 157పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న సీఎస్కేకు శుభారంభం దక్కలేదు. తొలి మూడు ఓవర్లలో వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది. డుప్లెసిస్​(0), మొయిన్​ అలీ(0), సురేష్​ రైనా(4) వరుసగా పెవిలియన్​ చేరారు. ఓపెనర్​ గైక్వాడ్​ మాత్రమే మ్యాచ్​ చివరకు ఉండి స్కోరు బోర్డును నడిపించాడు. నాలుగో వికెట్​గా వచ్చిన సారథి ధోనీ(3) కూడా నిరాశపరిచాడు. మిల్నే బౌలింగ్​లో బౌల్ట్​కు క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు. నిలకడగా ఆడుతున్న జడేజా(26) బుమ్రా బౌలింగ్​లో పొలార్డ్​ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన బ్రావో(23) ధనాధన్​ షాట్లు ఆడి ఔటయ్యాడు. ముంబయి బౌలర్లలో బౌల్ట్​, అడం మిల్నే, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు.

ఇదీ చూడండి: Ipl 2021: టాస్​ గెలిచిన సీఎస్కే.. రోహిత్​ లేకుండానే ముంబయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.