ETV Bharat / sports

ముంబయి కెప్టెన్ రోహిత్​ శర్మకు జరిమానా - rohit fined for slow over rate

దిల్లీతో మ్యాచ్ సందర్భంగా ముంబయి ఇండియన్స్​ కెప్టెన్ రోహిత్ శర్మకు జరిమానా పడింది. నిర్ణీత సమయానికి ఒక్క ఓవర్​ తక్కువగా వేయడం వల్ల రూ.12 లక్షలు ఫైన్ విధించారు.

rohit sharma, mumbai indians captain
రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్​ కెప్టెన్
author img

By

Published : Apr 21, 2021, 8:56 AM IST

Updated : Apr 21, 2021, 9:19 AM IST

స్లో ఓవర్​రేట్​ కారణంగా ముంబయి ఇండియన్స్​ కెప్టెన్ రోహిత్​ శర్మకు జరిమానా పడింది. ఈ విషయాన్ని లీగ్​ అధికారికంగా ప్రకటించింది. చెన్నై వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్​లో నిర్ణీత సమయంలో ఒక ఓవర్​ను తక్కువగా వేసింది ముంబయి. దీంతో రూ.12 లక్షలు ఫైన్​ విధించారు.

జరిమానాల వివరాలివే..

  • లీగ్​లో భాగంగా తొలి మ్యాచ్​లో స్లో ఓవర్​రేట్ తప్పిదం జరిగితే.. సంబంధిత టీమ్​ సారథికి రూ.12 లక్షల జరిమానా విధిస్తారు.
  • ఇదే జట్టు రెండో సారి స్లో ఓవర్​రేట్​ తప్పిదం చేస్తే కెప్టెన్​కు రూ.24 లక్షలు ఫైన్​తో పాటు జట్టు సభ్యులకు మ్యాచ్​ ఫీజులో రూ.6 లక్షలు లేదా 25 శాతం.. ఏది తక్కువైతే అది విధిస్తారు.
  • మూడో సారి ఇదే తప్పిదం జరిగితే టీమ్​ సారథికి రూ.30 లక్షల జరిమానాతో పాటు మిగతా ఆటగాళ్లకు మ్యాచ్​ ఫీజులో రూ.12 లక్షలు లేదా 50 శాతం.. ఏది తక్కువైతే అది విధిస్తారు.

దిల్లీతో జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన రోహిత్​ సేన.. 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పంత్ సేన 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

ఇదీ చదవండి: యూత్​ బాక్సింగ్: సెమీస్‌లో మరో ఏడుగురు భారతీయులు

ఇదీ చదవండి: 'దక్షిణాఫ్రికా బోర్డు సంక్షోభంలో జోక్యం చేసుకోం'

Last Updated : Apr 21, 2021, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.