ETV Bharat / sports

సెప్టెంబర్​లో ఐపీఎల్.. ఎక్కడనేదే ప్రశ్న!

కోట్లాది మంది క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేస్తూ ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా వేశారు. కరోనా కారణంగా తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మిగిలిన టోర్నీ ఎప్పుడు పూర్తి చేయాలా? అన్న అంశంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. ఇందుకోసం యూఏఈ, యూకే, ఆస్ట్రేలియా దేశాల్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

IPL may restart in September
సెప్టెంబర్​లో ఐపీఎల్.
author img

By

Published : May 6, 2021, 12:33 PM IST

Updated : May 6, 2021, 4:10 PM IST

నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌-2021ను మళ్లీ ఎప్పుడు నిర్వహించాలన్న చర్చ మొదలైంది. సీజన్‌ మలిదశ పూర్తి చేసేందుకు సరైన సమయం, వేదిక గురించి బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ఇతర దేశాల క్రికెట్‌ షెడ్యూళ్లను అనుసరించి సెప్టెంబర్లో రెండో దశను నిర్వహిస్తే బాగుంటుందని బోర్డు పెద్దలు భావిస్తున్నారట. యూఏఈ, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలో ఏదో ఒక చోటికి వేదికను మార్చాలని అనుకుంటున్నట్టు సమాచారం.

ఇంగ్లాండ్‌లో..

జులైలో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనుంది. టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ ఇందులో తలపడనున్నాయి. టెస్టుకు కొన్ని రోజుల ముందుగానే కోహ్లీసేన అక్కడికి చేరుకోనుంది. ఫైనల్‌ ముుగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ ఫార్మాట్లో తలపడనుంది. సిరీస్‌ ముగిసే సరికి సెప్టెంబర్‌ అవుతుంది. అందుకని అదే నెలలో ఐపీఎల్‌ మిగిలిన మ్యాచులు అక్కడే నిర్వహించాలన్నది ఒక ఆలోచన.

యూఏఈలో..

గతేడాది ఐపీఎల్‌ను యూఏఈలో విజయవంతంగా నిర్వహించారు. మళ్లీ అక్కడికే వేదికను మారిస్తే మెరుగని మరో ఆలోచన. అక్కడి పిచ్‌లు, వాతావరణం, బయో బుడగ, కరోనా పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. ఇంగ్లాండ్‌ సిరీస్‌ ముగియగానే నేరుగా ఆంగ్లేయులు, భారత ఆటగాళ్లను దుబాయ్‌కు తీసుకెళ్లాలన్నది యోచన. యూఏఈకి వచ్చేందుకు ఇతర దేశాల ఆటగాళ్లకూ అభ్యంతరం ఉండదని అనుకుంటున్నారు. అలాగే లీగ్‌ ముగియగానే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించే అవకాశం ఉంది. కానీ, సెప్టెంబర్లో యూఏఈలో ఎండలు విపరీతంగా ఉంటాయి.

ఆసీస్‌లో..

ఆస్ట్రేలియాలో ఐపీఎల్‌ నిర్వహిస్తే బాగుంటుందని మరో ఆలోచన. ప్రస్తుతం ఆ దేశంలో రాకపోకలపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. బహుశా నాలుగు నెలల్లో ప్రభుత్వం వీటిని తొలగిస్తుందని అంచనా. వాస్తవంగా 2020లో టీ20 ప్రపంచకప్‌ను ఆసీస్‌లోనే నిర్వహించాల్సింది. అది వాయిదా పడటం వల్ల 2021 కప్‌ను భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. 2022 హక్కులు ఆసీస్‌కు ఇచ్చారు. చర్చలు జరిపితే ఈ ఏడాది మెగా టోర్నీని అక్కడ నిర్వహించే వచ్చే ఏడాది భారత్‌లో ఆతిథ్యమిచ్చేందుకు మార్గం సుగమం కావచ్చు. క్రికెట్‌ ఆస్ట్రేలియాకు ఇందుకు అభ్యంతరం ఉండకపోవచ్చు. ఇదే జరిగితే పెర్త్‌ వేదికగా సెప్టెంబర్లో ఐపీఎల్‌ నిర్వహిస్తే మెరుగు. పెర్త్‌ సమయం భారత కాలమానం కన్నా 3.30 గంటలు ముందుంటుంది. వీక్షణకు అనువుగా ఉంటుంది. ఏదేమైనా సరే కొత్త వేదికలో ఐపీఎల్‌ను పెడితే కొత్తగా ఉంటుందని లీగ్‌ వర్గాల అభిప్రాయం.

ఇవీ చూడండి: ఐపీఎల్ వాయిదా.. వీరికి మాత్రం సంతోషమే!

Last Updated : May 6, 2021, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.