ETV Bharat / sports

మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. మహ్మద్ సిరాజ్​ను​ టార్గెట్ చేస్తూ.. - మహ్మద్​ సిరాజ్​ లేటెస్ట్​ న్యూస్

బెట్టింగ్​లో డబ్బులు కోల్పోయిన ఓ వ్యక్తి.. టీమ్​ఇండియా​ పేసర్​ మహ్మద్ సిరాజ్​ను సంప్రదించాడు. టీమ్​ఇండియా​ అంతర్గత విషయాలను తెలియజేయాలంటూ కోరాడు. దీంతో అప్రమత్తమైన సిరాజ్.. ఆ వ్యక్తిపై బీసీసీఐ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశాడు.

mohammed siraj
mohammed siraj
author img

By

Published : Apr 19, 2023, 12:36 PM IST

Updated : Apr 19, 2023, 2:49 PM IST

క్రికెట్ ప్రపంచంలో మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేగింది. బెట్టింగ్​లో డబ్బులు కోల్పోయిన ఓ వ్యక్తి.. టీమ్​ఇండియా అంతర్గత వివరాలు తెలుసుకునేందుకు ​ఇండియన్​ టీమ్​ ప్లేయర్​ మహ్మద్ సిరాజ్​ను సంప్రదించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సిరాజ్ అప్రమత్తమై​.. ఈ విషయం గురించి బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్​కు ఫిర్యాదు చేశాడు. తనకు ఓ గుర్తు తెలియని నెంబర్​ నుంచి వాట్సాప్​ మెసేజ్​ వచ్చిందని ​ తెలిపాడు. దీంతో అతను చెప్పిన వివరాలను నోట్​ చేసుకున్న యాంటీ కరప్షన్​ యూనిట్ సభ్యులు​.. ఈ విషయంపై లీగల్​గా ఫిర్యాదు నమోదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు​.. ఆ వ్యక్తిని ట్రేస్​ చేసి అదుపులోకి తీసుకుని దర్యప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి తమ అధీనంలోనే ఉన్నాడని, అతని నుంచి పూర్తి వివరాలను సేకరిస్తున్నామని వివరించారు. ఫిబ్రవరిలో భారత్​- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్​ మొదలవ్వక ముందు ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.

కేసు విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అసలు సిరాజ్‌ను సంప్రదించింది బుకీ కాదని.. హైదరాబాద్‌కు చెందిన ఓ డ్రైవర్ అని తేలింది. బెట్టింగ్​కు అలవాటు పడ్డ సదరు హైదరాబాద్​కు చెందిన ఆ వ్యక్తి.. భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడని.. ఈ క్రమంలోనే అంతర్గత సమాచారం కోసం సిరాజ్‌ను సంప్రదించాడని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. అయితే ఇక్కడ మహ్మద్ సిరాజ్ స్వస్థలం కూడా హైదరాబాదే కావడం వల్ల ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ వ్యక్తితో సిరాజ్‌కు గతంలో సంబంధాలు ఏమైనా ఉన్నాయా లేదా.. అనే కోణంలోనూ దర్యాప్తు చేసినట్లు తెలిసింది.

కాగా, 2013లో జరిగిన బెట్టింగ్​ కుంభకోణంలో సీఎస్కే టీమ్​ ప్రిన్సిపల్​ గురునాథ్ మయప్పన్‌తో పాటు శ్రీశాంత్​, అంకిత్​ చవాన్​, అజిత్​ చందాలియా అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత నుంచి ఐపీఎల్​ ప్లేయర్లపై బీసీసీఐ అవినీతి నీరోధక శాఖ ఓ కన్నేసింది. దీంతో అప్పటి నుంచి పత్రి టీమ్​కు ఓ ఏసీయూ అధికారిని నియమించింది బీసీసీఐ. జట్టుతో పాటు వారు ఉన్న హోటల్​లో బస చేసే ఆ ఆధికారి.. టీమ్స్​ ప్లేయర్ల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు.

అంతే కాకుండా జట్టు సభ్యులు అప్రమత్తంగా ఉండేందుకు వారు చేయవలసిన పనులతో పాటు చేయకూడని వాటిపై తప్పనిసరిగా ఓ వర్క్​షాప్​ను నిర్వహిస్తుంది అవినీతి నిరోధక విభాగం. ఈ క్రమంలో ఏ ప్లేయరైనా అవినీతిని అధికారులకు తెలియజేయడంలో విఫలమైతే, వారిపై కఠిన ఆంక్షలు అమలైన సందర్భాలు ఉన్నాయి. 2021లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఈ కారణంతోనే సస్పెండ్ అయ్యాడు.

ఇదీ చూడండి: 'అర్జున్​కు ఆ క్లారిటీ ఉంది'.. తెందూల్కర్ తనయుడిపై రోహిత్ ప్రశంసల జల్లు

Last Updated : Apr 19, 2023, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.