టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్(KKR Vs PBKS) నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (67) అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. రాహుల్ త్రిపాఠి (34) రాణించాడు. నితీశ్ రాణా (31) దూకుడుగా ఆడాడు. శుభ్‌మన్ గిల్ (7) మరోసారి నిరాశ పరిచాడు. అర్ష్ దీప్ సింగ్ వేసిన మూడో ఓవర్లో బౌల్డయి పెవిలియన్ చేరాడు.
కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (2), టిమ్ సీఫర్ట్ (2) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. మహమ్మద్ షమీ వేసిన 16 ఓవర్లో మోర్గన్ ఎల్బీగా వెనుదిరుగగా.. 18వ ఓవర్లో సీఫర్ట్ రనౌటయ్యాడు. దినేశ్ కార్తిక్ (11) ధాటిగా ఆడలేకపోయాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ మూడు, రవి బిష్ణోయ్ రెండు, మహమ్మద్ షమి ఒక వికెట్ తీశారు.
ఇదీ చూడండి.. IPL 2021 News: టాస్ గెలిచిన పంజాబ్.. కోల్‌కతా బ్యాటింగ్