ETV Bharat / sports

ఐపీఎల్​ వేలం ఎప్పుడు, ఎక్కడ?- వివరాలివే - ipl auction 2021

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ వేలం ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? వేలాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఏయే ఛానల్లో వీక్షించవచ్చో తెలుసుకోండి.

ipl-auction-2021-when-and-where-to-watch-ipl-auction-on-tv-online-live-streaming-details
ఐపీఎల్​ వేలం ఎప్పుడు, ఎక్కడ- వివరాలివే
author img

By

Published : Feb 17, 2021, 4:29 PM IST

క్రికెట్​ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్​ వేలానికి కొన్ని గంటలే సమయం ఉంది. అయితే ఈ వేలం ఎక్కడ జరుగనుంది? ఏ ఆటగాడిని ఎంత ధరకు ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుంది? ఈ వేలాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఏయే ఛానల్లో వీక్షించవచ్చు? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.

  • ఫిబ్రవరి 18, గురువారం చెన్నై వేదికగా 2021 ఐపీఎల్​ వేలం నిర్వహించనున్నారు.
  • వేలం పాట మధ్యాహ్నాం 3 గంటలకు ప్రారంభమవుతుంది.
  • ఈ ఐపీఎల్​ వేలాన్ని స్టార్​ స్పోర్ట్స్​ 1, స్టార్​ స్పోర్ట్స్​ 1 హెచ్​డీ, స్టార్​ స్పోర్ట్స్​ 3, స్టార్​ స్పోర్ట్స్​ 3 హెచ్​డీ ఛానల్లో​ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.
  • అంతేకాకుండా ఈ వేలాన్ని హాట్​స్టార్​ ద్వారా ఆన్​లైన్​లోనూ చూడవచ్చు.

ఏ కేటగిరిలో ఎంతమంది?

మొత్తంగా 113 మంది క్యాప్​డ్ ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకోగా రూ.2 కోట్ల జాబితాలో 10 మంది, 1.5 కోట్ల జాబితాలో 12 మంది, రూ.1 కోటి జాబితాలో 11 మంది, రూ.75 లక్షల కేటగిరీలో 15 మంది, రూ.50 లక్షల కేటగిరీలో 65 మంది ఉన్నారు. సచిన్ తనయుడు అర్జున్ తెందూల్కర్​తో పాటు మరికొందరు రూ.20 లక్షల జాబితాలో ఉన్నారు.

ఏ జట్టు ఎంతమందిని తీసుకోవచ్చు?

అత్యధికంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద 13 స్లాట్స్ ఉన్నాయి. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (9), రాజస్థాన్ రాయల్స్ (8), కోల్​కతా నైట్​రైడర్స్ (8), సన్​రైజర్స్ హైదరాబాద్ వద్ద 3 స్లాట్స్ మిగిలి ఉన్నాయి. పంజాబ్ వద్ద అత్యధికంగా రూ.53.1 కోట్ల మిగులు బడ్జెట్ ఉండగా.. సన్​రైజర్స్ వద్ద తక్కువగా రూ.10.75 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉంది.

ఇదీ చదవండి: ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్​: టాప్​-5లోకి అశ్విన్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.