ETV Bharat / sports

నెట్టింట ట్రెండింగ్​లో కావ్య పాప రియాక్షన్స్​.. 'పాపం ఆమె కోసమైనా గెలవండి సామీ!' - కావ్య మారన్​ సన్​రైజర్స్​

ఉప్పల్​ వేదికగా కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ అనూహ్యంగా ఓడిపోయింది. చిన్నపాటి లక్ష్యంతో తేలికగా గెలవాల్సిన మ్యాచ్​ను చేజేతుల కోల్​కతాకు అప్పగించేసింది. దీంతో ఆరెంజ్​ ఫ్యాన్స్​ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే ఎప్పుడూ జట్టు కోసం నిలబడి ఎంకరేజ్​ చేసే కావ్య మారన్​ సైతం ఈ ఓటమితో డీలా పడిపోయారు. దీంతో మ్యాచ్​ సమయంలో ఆమె రియాక్షన్స్​ సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

kavya maran sun risers
kavya maran sun risers
author img

By

Published : May 5, 2023, 11:15 AM IST

ఐపీఎల్ 16వ​ సీజన్​లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. గెలవాల్సిన మ్యాచుల్లోనూ ఓటమి మూటగట్టుకోవడాన్ని చూసి ఫ్యాన్స్​ ఇంతకింత నిరాశ చెందుతున్నారు. తమ బాధను వ్యక్తపరిచేందుకు సోషల్ మీడియాలో మీమ్స్​ వేసి ట్రెండ్​ చేస్తున్నారు. సన్​రైజర్స్​ టీమ్​ను ట్రోల్​ చేస్తున్నారు. అయితే మ్యాచ్​ ఓడినా గెలిచినా.. ఏ మాత్రం నిరాశ చెందకుండా జట్టును ఎంకరేజ్ చేసేదాంట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ముందుంటారు.

టీమ్​ ఆడిన ప్రతీ మ్యాచ్‌కు హాజరై.. ప్లేయర్లలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటారు. తన అందంతో ఎంతో మంది హృదయాలు కొల్లగొట్టిన కావ్య మారన్.. స్టేడియంలో సన్​రైజర్స్​ జట్టును ఎంకరేజ్​ చేస్తూ సందడి చేస్తుంటారు. దీంతో కెమెరామెన్ కూడా కావ్య పాప క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌ను మిస్ అవ్వకుండా ఫోకస్ పెడుతుంటాడు. అయితే ఉప్పల్​ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్​లో హైదరాబాద్ జట్టు ఓడిపోవడం వల్ల కావ్య పాపపై నెట్టింట మీమ్స్ పేలుతున్నాయి.

మ్యాచ్​ మొదట్లో ఉత్సాహంగా కన్పించే కావ్య పాప.. టీమ్ ప్లేయర్స్​ అద్భుతంగా ఆడినప్పుడు ఫుల్​ జోష్​తో ఉత్సాహపరుస్తుంటారు. స్టాండ్​లో కూర్చునే ఆమె ప్లేయర్ల భారీ షాట్లకు ఎగిరి గెంతేస్తుంటారు. అయితే కాసేపటికే ప్లేయర్లు పేలవ ప్రదర్శన చూపిస్తున్నారు. ఆఖరికి నిరాశతోనే వెనుదిరగడం జరుగుతోంది. గురువారం జరిగిన మ్యాచ్​లోనూ అదే జరిగింది. ప్రతీ మ్యాచులోనూ గెలిచే అవకాశాలు చూపించి ఆఖరికి ఓడిపోవడం.. ఇదే పరిపాటిగా మారిందని.. ఇలా కాకుండా కావ్య మారన్ కోసమైనా.. మ్యాచ్​లు గెలవండి సామీ అంటూ నెటిజన్లు సోషల్​ మీడియా వేదికగా ఆరెంజ్​ ఆర్మీనీ కోరుతున్నారు.

ఇక గురువారం కోల్​కతా జరిగిన మ్యాచ్​ విషయానికి వస్తే.. సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ మరోసారి నిరాశ పరిచింది. మ్యాచ్‌లో ఎక్కువ శాతం ఆధిపత్యం కనబరిచిన ఆ జట్టు ఆఖర్లో చేతులెత్తేసింది. గురువారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 5 పరుగుల తేడాతో కోల్‌కతా చేతిలో ఓడింది. కాగా ఐపీఎల్​ 16వ సీజన్​లో సన్​రైజర్స్​ జట్టు.. ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడింది. అయితే ఇందులో మూడు మాత్రమే గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. అయితే ఇక నుంచి ఆడే ప్రతీ మ్యాచ్​లోనూ గెలిస్తే తప్పు ప్లే ఆఫ్ చేరే అవకాశం లేదని ఫ్యాన్స్​ అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.