ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుస అపజయాలను మూటగట్టుకుంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. తీవ్ర గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్.. ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ బాధాకరమైన విషయాన్ని సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ట్విట్టర్ వేదికగా గురువారం ప్రకటించింది. తొడ కండరాల గాయంతో భాదపడుతున్న సుందర్.. ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడని ట్వీట్లో పేర్కొంది. అంతే కాకుండా అతను త్వరగా కోలుకోవాలని ఫ్రాంచైజీ ఆశిస్తున్నట్లు తెలిపింది.
-
🚨 INJURY UPDATE 🚨
— SunRisers Hyderabad (@SunRisers) April 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Washington Sundar has been ruled out of the IPL 2023 due to a hamstring injury.
Speedy recovery, Washi 🧡 pic.twitter.com/P82b0d2uY3
">🚨 INJURY UPDATE 🚨
— SunRisers Hyderabad (@SunRisers) April 27, 2023
Washington Sundar has been ruled out of the IPL 2023 due to a hamstring injury.
Speedy recovery, Washi 🧡 pic.twitter.com/P82b0d2uY3🚨 INJURY UPDATE 🚨
— SunRisers Hyderabad (@SunRisers) April 27, 2023
Washington Sundar has been ruled out of the IPL 2023 due to a hamstring injury.
Speedy recovery, Washi 🧡 pic.twitter.com/P82b0d2uY3
ఐపీఎల్ వేలంలో వాషింగ్టన్ సుందర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. తొలి 6 మ్యాచుల్లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయని సుందర్.. దిల్లీతో జరిగన మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. ఇటీవల దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాడు. ఒకే ఓవర్‌లో మూడు కీలక వికెట్లను పడగొట్టి ఔరా అనిపించాడు.
8 ఓవర్ రెండో బంతికి వార్నర్‌ను, నాలుగో బంతికి సర్ఫరాజ్ ఖాన్‌ను, చివరి బంతికి అమాన్ ఖాన్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. కాగా ఈ ముగ్గురూ క్యాచ్ ఔట్ కావడం గమనార్హం. తన బౌలింగ్ స్కిల్స్‌తో మూడు వికెట్లు పడగొట్టిన సుందర్.. బ్యాటింగ్‌లోనూ ఇరగదీశాడు. దీంతో ఆ మ్యాచ్‌లో దిల్లీ ప్లేయర్లకు చుక్కలు చూపించాడు.
ఒక్కప్పుడు తన గేమ్‌కు ట్రోలింగ్ ఎదుర్కొన్న సుందర్ ఇప్పుడు అద్భుతమైన ప్రదర్శనతో అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.ఈ క్రమంలో సుందర్ ఇలా ఫామ్‌లోకి వస్తున్న సమయంలో గాయం బారిన పడి జట్టుకు దూరమవ్వడం చాలా బాధగా ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ లేక ఇబ్బంది పడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సుందర్ దూరమవ్వడం ఓ కోలుకోలేని దెబ్బ అని అంటున్నారు.
ఇలా వరుస ఎదురుదెబ్బలను ఎదుర్కొంటున్న సన్‌రైజర్స్ టీమ్‌కు ఇప్పుడు టీమ్ కాంబినేషన్ కూడా ఇబ్బంది కానుంది. ఇప్పటి వరకు అయితే సుందర్ స్థానంలో రానున్న ఆటగాడి పేరును ఫ్రాంచైజీ ప్రకటించలేదు. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ రెండింటిలో మాత్రమే గెలిచి పాయింట్స్ పట్టికలో 9వ స్థానానికి ఎగబాకింది.
ఇక ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 5 మ్యాచ్‌లైనా గెలిచి తీరాలి. అంతే కాకుండా రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండాలి. కానీ వాషింగ్టన్ సుందర్ దూరమవ్వడంతో పాటు.. జట్టులో అతన్ని భర్తీ చేసే ఆటగాడు లేకపోవడం కూడా ఇప్పుడు సన్‌రైజర్స్ విజయవకాశాలను దెబ్బతీసే అవకాశలున్నాయి.