IPL 2023 MI VS SRH : ఐపీఎల్ 2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి... కామెరూన్ గ్రీన్(47 బంతుల్లో 100; 8x4,8x6) మెరుపు సెంచరీ తోడవ్వడంతో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఛేదనలో ముంబయి మొదటి నుంచే దూకుడు ప్రదర్శించింది. ఇషాన్ ఔటయిన తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన కామెరూన్ గ్రీన్ విశ్వరూపం చూపాడు. బ్యాట్‌ను ఝళిపించి సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (37 బంతుల్లో 56; 8x4, 1x6) హాఫ్ సెంచరీతో చాలా రోజుల తర్వాత ఫామ్‌లోకి వచ్చాడు. సెంచరీతో కదం తొక్కిన గ్రీన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ (46 బంతుల్లో 83 పరుగులు: 8x4,4x6 ), వివ్రాంత్ శర్మ (47 బంతుల్లో 69 పరుగులు9x4, 2x6) అర్ధ సెంచరీలతో చెలరేగిపోయారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. 13.5 ఓవర్ల వద్ద ఆకాశ్ మధ్వాల్ వివ్రాంత్ వికెట్ పడగొట్టి ఈ జోడినీ విడదీశాడు. తర్వాత వచ్చిన క్లాసెన్(18), ఫిలిప్స్(1), బ్రూక్(0) నిరాశ పరిచారు. కెప్టెన్ మర్క్రమ్(13) నాటౌట్‌గా నిలిచాడు. ముంబయి బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 4 వికెట్లతో మెరిశాడు. క్రిస్ జోర్డాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
మయాంక్ ఇదే తొలిసారి.. గత సీజన్‌లో పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్‌ను.. మినీ వేలంలో సన్‌రైజర్స్ సొంతం చేసుకుంది. సీజన్ ప్రారంభం నుంచి ఘోరంగా విఫలమవుతున్న మయంక్ ముంబయితో మ్యాచ్‌లో ఎట్టకేలకు భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన మయంక్.. 270 పరుగులు చేశాడు. మయంక్తో జతగా ఓపెనింగ్‌కు వచ్చిన వివ్రాంత్ శర్మ రెచ్చిపోయి ఆడాడు.
ఆశలు సజీవం.. ఇక ఈ విజయంతో ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు ఓడితే.. ముంబయి 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ఆర్సీబీ కూడా గెలిస్తే ఆ జట్టు కూడా 16 పాయింట్లు సాధిస్తుంది. ముంబయి కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్నందున ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్తుతుంది. ముంబయి ఇండియన్స్ ఐదో స్థానంతో టోర్నీని ముగిస్తుంది.
ఐపీఎల్లో సెంచరీల మోత:
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఇది తొమ్మిదో సెంచరీ. గ్రీన్(100 పరుగులు) కంటే ముందు హెన్రిచ్ క్లాసెన్ (104 పరుగులు), విరాట్ కోహ్లీ (100), శుభ్‌మన్ గిల్ (101 పరుగులు), ప్రభ్సిమ్రాన్ సింగ్ (103 పరుగులు) , సూర్యకుమార్ యాదవ్ (103* పరుగులు), యశస్వి జైస్వాల్ (124 పరుగులు), వెంకటేష్ అయ్యర్ (104 పరుగులు), హ్యారీ బ్రూక్ (100* పరుగులు) శతకాలు బాదారు.
ఇవీ చదవండి: