ETV Bharat / sports

IPL 2023 :  పింక్​ టీమ్​కు లఖ్‌నవూ షాక్‌.. 154 కొట్టి గెలిచేశారుగా

author img

By

Published : Apr 19, 2023, 10:58 PM IST

Updated : Apr 20, 2023, 6:31 AM IST

ఐపీఎల్‌-16లో నిలకడగా రాణిస్తున్న రెండు జట్ల మధ్య పోరులో లఖ్‌నవూదే పైచేయిగా నిలిచింది. బుధవారం ఆ జట్టు 10 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను ఓడించింది. 200 పైచిలుకు లక్ష్యాలు కూడా సురక్షితం కాదన్నట్లుగా సాగుతున్న ఐపీఎల్‌లో.. విధ్వంసక బ్యాటర్లకు నెలవైన రాజస్థాన్‌ ఈజీగా సాధిస్తుందన్న సమయంలో ఆ ఆలోచలనను తలకిందలు చేస్తూ.. తమ ముందు ఉన్న లక్ష్యాన్ని కాపాడుకుని లఖ్​నవూ ఔరా అనిపించింది. సూపర్‌జెయింట్స్‌.

IPL 2023
IPL 2023 రాజస్థాన్ రాయల్స్ లఖ్​నవూ సూపర్ జెయింట్స్​

2023 ఐపీఎల్ సీజన్​లో నిలకడగా రాణిస్తున్న రాజస్థాన్​ లఖ్​నవూ పోరులో లఖ్‌నవూదే పైచేయిగా నిలిచింది. బుధవారం ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్​లో.. లఖ్​నవూ జట్టు 10 పరుగుల తేడాతో గెలుపొందింది. రోజూ బ్యాటింగ్‌ మెరుపులే చూస్తున్న ఐపీఎల్‌లో చిన్న బ్రేక్‌ అన్నట్లుగా బౌలర్ల ఆధిపత్యం సాగిన పోరులో పైచేయి సాధించిన లఖ్‌నవూ.. ఈ సీజన్​లో తన నాలుగో విజయంతో రాజస్థాన్‌ను సమం చేసింది.

లఖ్‌నవూ 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులే చేసింది. కైల్‌ మేయర్స్‌, కేఎల్‌ రాహుల్‌ రాణించారు. అశ్విన్‌, బౌల్ట్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఆ తర్వాత క్రీజులోకి దిగిన అవేశ్​ ఖాన్‌ , 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' స్టాయినిస్‌ సహా బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం వల్ల రాయల్స్‌ నిర్ణీత ఓవర్లలో 144/6కు పరిమితమైంది. యశస్వి జైశ్వాల్‌ టాప్‌స్కోర్​గా నిలిచాడు.

మంచి ఆరంభం దక్కినా..: పడిక్కల్‌, బట్లర్‌, యశస్వి, శాంసన్‌,హెట్‌మయర్‌ లాంటి దూకుడైన ఆటగాళ్లతో కూడిన రాజస్థాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌కు 155 పరుగుల లక్ష్యం ఒక లెక్కా అనుకున్న సమయానికి.. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ఛేదన అంత తేలిక కాదని రుజువైంది.

రాయల్స్‌ బౌలింగ్‌ చూసి మొదట ఆహా అనుకున్న ఆడియన్స్​.. ఆ తర్వాత సూపర్‌జెయింట్స్‌ బౌలింగ్‌ చూసి ఔరా అనుకోవాల్సి వచ్చింది. నిజానికి ఛేదనలో రాజస్థాన్‌ జట్టుకు మంచి ఆరంభమే లభించింది. బంతి బ్యాట్‌ మీదికి రాకపోయినా.. యశస్వి జైశ్వాల్‌ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.

మరో ఎండ్‌లో బట్లర్‌ మాత్రం పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఒకానొక దశలో అతను 21 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత అతను కొంచెం కుదురుకున్నాక రాయల్స్‌ ఛేదన సాఫీగానే సాగుతున్నట్లు అనిపించింది. 12వ ఓవర్లో ఆ జట్టు 89/0 స్కోర్​తో పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ అదే ఓవర్లో స్టాయినిస్‌.. యశస్విని ఔట్‌ చేయడం వల్ల మ్యాచ్‌ మలుపు తిరిగింది. అక్కడి నుంచి క్రమ క్రమంగా వికెట్లు పడ్డాయి.

శాంసన్‌ రనౌటై వెనుదిరగ్గా.. బట్లర్‌ను సైతం స్టాయినిసే పెవిలియన్‌ చేర్చాడు. చివరి 5 ఓవర్లలో 51 పరుగులు చేయాల్సి రాగా.. విధ్వంసక బ్యాటర్‌ హెట్‌మయర్​ను అవేశ్​ ఔట్‌ చేయడంతో రాయల్స్‌కు ఇక కష్టకాలం మొదలయ్యిందని తేలిపోయింది. అయితే 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌'గా బరిలోకి దిగిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ పోరాడటంతో రాయల్స్‌ ఆశలు వదులుకోలేదు. చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా.. పడిక్కల్‌ కూడా అద్భుతాలేమీ చేయలేకపోయాడు. అవేశ్​ వేసిన ఈ ఓవర్లో పడిక్కల్‌, జూరెల్‌ వరుస బంతుల్లో ఔట్​ అవ్వడం వల్ల రాజస్థాన్‌కు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి.

ఇదీ చూడండి: ICC T20 Rankings : నెం.1 స్థానంలోనే సూర్య భాయ్​

Last Updated : Apr 20, 2023, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.