ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎంత మంది ప్లేయర్ ఉన్నా.. సోషల్‌మీడియాలో మీమర్స్‌కి మాత్రం ఇది 'అర్జున్ తెందుల్కర్ వర్సెస్ శుభమన్ గిల్ మధ్యలో సారా' మ్యాచ్. ఎందుకంటే.. సచిన్ తెందుల్కర్ కూతురు సారా తెందుల్కర్-టీమ్ఇండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ గతంలో చాలా కాలంగా సీక్రెట్ డేటింగ్‌లో ఉన్నారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ ఇద్దరూ ఎప్పుడూ కలిసి బయట కనిపించినట్లు ఫోటోలు, వీడియోలు బయటికి రాలేదు. కానీ వీరిద్దరు వేర్వేరుగా ఒకేసారి షేర్ చేసిన ఫోటోలు.. ఒకే లోకేషన్‌లో దిగినవిగా ఉంటుంటాయి! అయితే ఆ తర్వాత ఈ జంటకు బ్రేకప్ అయిందని.. గిల్.. హీరోయిన్ సారా అలీ ఖాన్‌తో డేటింగ్ ప్రారంభించినట్లు ప్రచారం మొదలైంది. వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.
అయితే ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తరుపున ఐపీఎల్ ఆరంగ్రేటం చేశాడు సారా తెందుల్కర్ తమ్ముడు అర్జున్ తెందుల్కర్. మూడు మ్యాచులాడిన అతడు.. తొలి రెండు మ్యాచుల్లో పర్వాలేదనిపించే ప్రదర్శన చేసినప్పటికీ.. మూడో మ్యాచులో పంజాబ్కింగ్స్పై ఏకంగా 31 పరుగులు సమర్పించుకుని విమర్శలను ఎదుర్కొన్నాడు.
అయితే తాజాగా జరిగే మ్యాచులో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ బరిలోకి దిగుతాడు. మరి ముంబయి తరఫున కూడా ఓపెనింగ్ బౌలర్ అర్జున్ తెందుల్కర్ దిగితే.. వీరిద్దరి మధ్య పోరు ఎలా ఉంటుందా అని మీమర్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు? మరోవైపు మ్యాచు చూడటానికి స్టేడియానికి వచ్చే సారా తెందుల్కర్ తమ్ముడికి సపోర్ట్ చేస్తుందా? లేక మాజీ రూమర్ బాయ్‌ఫ్రెండ్‌కా అని తెగ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. 'అర్జున్ తెందుల్కర్ వర్సెస్ శుభమన్ గిల్ మధ్యలో సారా' మ్యాచ్ అని ట్రెండ్ చేస్తున్నారు. అలాగే గిల్ కొత్త రూమర్ గర్ల్‌ఫ్రెండ్ సారా అలీఖాన్ కూడా ఈ మ్యాచ్‌కు వస్తే.. ఇద్దరు సారాల మధ్య గిల్ అంటూ వీడియోలు క్రియేట్ చేసిన ట్రెండ్ చేస్తున్నారు. ఇవి చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ ఆసక్తికర పోరు అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య గతంలో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి తరఫున చాలా కాలం ఆడాడు. చాలా సార్లు తన ఆల్‌రౌండ్ పెర్పామెన్స్‌తో ముంబయిని గెలిపించాడు. అయితే 2022 సీజన్‌లో ముంబయిని వీడి గుజరాత్‌కు సారథిగా ఎంపికయ్యాడు. అలా ఇప్పుడు రోహిత్ శర్మ- హార్దిక్ ప్రత్యర్థులుగా మారిపోయారు. దీంతో ఇరు జట్ల అభిమానులు ఈ మ్యాచ్‌ను గురు శిష్యుల మధ్య పోరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, రెండు టీమ్‌ల మధ్య ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ జరగ్గా.. అందులో ముంబయి ఇండియన్స్ 5 పరుగుల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
-
Match Day 💙
— MeghanadhPSPK45🦅 (@iammeghanadh45) April 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Gill ⚔️ Arjun == Sara 💥#GTvMI pic.twitter.com/bfbjIZBmhB
">Match Day 💙
— MeghanadhPSPK45🦅 (@iammeghanadh45) April 25, 2023
Gill ⚔️ Arjun == Sara 💥#GTvMI pic.twitter.com/bfbjIZBmhBMatch Day 💙
— MeghanadhPSPK45🦅 (@iammeghanadh45) April 25, 2023
Gill ⚔️ Arjun == Sara 💥#GTvMI pic.twitter.com/bfbjIZBmhB
-
Tonight Gill and Sara pic.twitter.com/zIqU4LLRIN
— Anoop 🇮🇳 (@ianooop) April 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tonight Gill and Sara pic.twitter.com/zIqU4LLRIN
— Anoop 🇮🇳 (@ianooop) April 25, 2023Tonight Gill and Sara pic.twitter.com/zIqU4LLRIN
— Anoop 🇮🇳 (@ianooop) April 25, 2023
-
Tonight’s match scenes,
— Dennis🕸 (@DenissForReal) April 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Arjun Tendulkar vs Shubman Gill 🫂 pic.twitter.com/atqLgdeCmR
">Tonight’s match scenes,
— Dennis🕸 (@DenissForReal) April 25, 2023
Arjun Tendulkar vs Shubman Gill 🫂 pic.twitter.com/atqLgdeCmRTonight’s match scenes,
— Dennis🕸 (@DenissForReal) April 25, 2023
Arjun Tendulkar vs Shubman Gill 🫂 pic.twitter.com/atqLgdeCmR
ఇదీ చూడండి: అనుష్కతో కలిసి వీధుల్లో విరాట్ బ్యాడ్మింటన్