రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. బంతిని ఛేజ్ చేసే క్రమంలో తొడ కండరాలు పట్టేయడం వల్ల మ్యాచ్ మధ్యలోనే మైదానన్ని వీడాడు. తీవ్రంగా నొప్పితో విలవిలలాడాడు.
బెంగళూరు ఇన్నింగ్స్ రెండో ఓవర్ లాస్ట్ బాల్‌కు డుప్లెసిస్ షాట్ బాదగా.. దానిని ఛేజ్ చేసే క్రమంలో ఒక్క సారిగా కింద పడిపోయాడు రాహుల్. నొప్పిని తట్టుకోలేక మైదానంలోనే విలవిలలాడిపోయాడు. వెంటనే ఫిజయోలు వచ్చి అతడిని పరీక్షించారు. అతడిని అక్కడిని తరలించేందుకు స్ట్రెచర్‌ను కూడా తీసుకొచ్చారు. కానీ కొద్దిసేపటికి అతడు తన సహచరుల సాయంతో మైదానాన్ని వీడాడు. రాహుల్ పరిస్థితి ఎలా ఉందో స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అతడిని స్కానింగ్ కోసం సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అతడి గాయం తీవ్రత గురించి తెలియాల్సి ఉంది. అతడు వీడడం వల్ల.. కృనాల్ పాండ్యా.. లఖ్‌నవూకు సారథం వహిస్తున్నాడు.
దూరమయ్యే అవకాశం.. కేఎల్ రాహుల్ గాయం తీవ్రత ఎక్కువైతే మాత్రం అతడు.. మిగిలిన ఐపీఎల్ మ్యాచులకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే జూన్‌లో ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆ పోరు కోసం బీసీసీఐ జట్టు కూడా ప్రకటించింది. అందులో రాహుల్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు తగిలిన గాయం తీవ్రత ఎక్కువైతే ఉంటే మాత్రం.. అతడు ఆ మ్యాచ్‌కు కూడా దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్, జస్ప్రిత్ బుమ్రా, రిషభ్ పంత్.. గాయాల వల్ల ఆటకు కొద్ది కాలం పాటు దూరమైన సంగతి తెలిసిందే.
అంతగా రాణించలేక.. ఈ ఐపీఎల్లో కేఎల్ రాహుల్ అంతగా రాణించలేకపోతున్నాడు. స్లోగా ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ.. స్ట్రైక్ రేట్ అత్యంత దారుణంగా ఉంది. దీంతో సోషల్‌మీడియాలో అతడిపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి.
-
Wishing a speedy recovery to @klrahul
— IndianPremierLeague (@IPL) May 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
See you back on the field soon 👍🏻👍🏻#TATAIPL | #LSGvRCB pic.twitter.com/2DPo7W2OuK
">Wishing a speedy recovery to @klrahul
— IndianPremierLeague (@IPL) May 1, 2023
See you back on the field soon 👍🏻👍🏻#TATAIPL | #LSGvRCB pic.twitter.com/2DPo7W2OuKWishing a speedy recovery to @klrahul
— IndianPremierLeague (@IPL) May 1, 2023
See you back on the field soon 👍🏻👍🏻#TATAIPL | #LSGvRCB pic.twitter.com/2DPo7W2OuK
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది బెంగళూరు. అయితే ఈ లక్నో పిచ్‌లు ఐపీఎల్ మ్యాచ్ చూసే అభిమానులకు, ఆడే జట్లకు సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఇక్కడ లఖ్‌నవూ బౌలర్ల కాస్త రాణించడంతో.. మరోవైపు పిచ్ స్లోగా ఉండటం వల్ల ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ డుప్లెసిస్(40 బంతుల్లో 44; 1x4, 1x6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లీ(30 బంతుల్లో 31; 3x4), దినేశ్ కార్తిక్(11 బంతుల్లో 16; 1x4, 1x6) మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్ కలిసి తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఎల్ఎస్జీ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3, రవి బిష్ణోయ్ 2, అమిత్ మిశ్రా 2, కృష్ణప్ప గౌతమ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
ఇదీ చూడండి: IPL 2023 LSG VS RCB : ఆర్సీబీ టీమ్‌లోకి ధోనీ ఫ్రెండ్!