ETV Bharat / sports

IPL 2023 ​: మెరిసిన మిల్లర్​, గిల్.. రాజస్థాన్ టార్గెట్​ ఎంతంటే? - సంజూ శాంసన్ గుజరాత్​ vs రాజస్థాన్

IPL 2023 ​: ఐపీఎల్​ 2023లో భాగంగా రాజస్థాన్​​తో జరుగుతున్నమ్యాచ్​లో గుజరాత్​ బ్యాటర్ శుభ్​మన్​ గిల్​ మెరిశాడు. రాజస్థాన్ టార్గెట్​ ఎంతంటే?

GT vs RR innings IPL 2023
GT vs RR innings IPL 2023
author img

By

Published : Apr 16, 2023, 9:12 PM IST

Updated : Apr 16, 2023, 10:18 PM IST

IPL 2023 ​: ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 16వ సీజన్​లో భాగంగా రాజస్థాన్​తో జరుగుతున్న మ్యాచ్​లో గుజరాత్​ టైటాన్స్​​​ జట్టు ఇన్నింగ్స్​ ముగిసింది. రాజస్థాన్​కు 178 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్​ ఓడిపోయి బ్యాటింగ్​కు చేసిన గుజరాత్​.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. గుజరాత్​ బ్యాటర్​​ శుభ్​మన్​ గిల్​ (45), డేవిడ్​ మిల్లర్​ (46) మెరిశారు. హార్దిక్​ పాండ్య (28), సాయి సుదర్శన్ (20), అభినవ్​ మహోనహర్​ (27) ఫర్వాలేదనిపించారు. ఓపెనర్​ వృద్ధిమాన్​ సహా (4), రషీద్​ ఖాన్ (1), రాహుల్​ తెవాతియా (1*), అల్జారీ జోసెఫ్​ (0*) పరుగులు చేశారు. రాజస్థాన్​ బౌలర్లలో సందీప్ శర్మ (2) వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్​ బౌల్ట్​ (1), యుజువేంద్ర చాహల్, ఆడమ్​ జంపా​ ఒక్కో వికెట్ తీశారు.

హార్దక్​ పాండ్య @2000 పరుగులు..
గుజరాత్​ టైటాన్స్​ జట్టు కెప్టెన్ హార్దిక్​ పాండ్య మరో ఘనత సాధించాడు. ఐపీఎల్​ కెరీర్​లో 2000 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఆల్​రౌండర్​ ఇప్పటివరకు 111 మ్యాచ్​లు ఆడి.. 2003 పరుగులు చేశాడు. ఇతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 91 పరుగులు. మొత్తంగా 50 వికెట్లు తీశాడు. షేన్​ వాట్సన్, ఆండ్రూ రస్సెల్, కిరన్​ పోలార్డ్​, రవీంద్ర జడేజా, జాకెస్​ కల్లిస్​ తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో ప్లేయర్​గా నిలిచాడు.

టాప్​ పర్ఫార్మర్​ సందీప్..
గుజరాత్​ ఇన్నింగ్స్​లో రాజస్థాన్​ బౌలర్​ సందీప్ శర్మ టాప్​ పర్ఫార్మర్​గా నిలిచాడు. నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి.. రెండు వికెట్లు తీశాడు. 6.25 ఎకానమీతో వేసిన బౌలింగ్​లో 10 డాట్​ బాల్స్ వేశాడు.

ఒకే క్యాచ్​ కోసం ముగ్గురు.. చివరకు..
గుజరాత్​ ఇన్నింగ్స్​లో ఆసక్తికర ఘటన జరిగింది. ఈ ఇన్నింగ్స్​లో మొదటి ఓవర్​ను బౌల్ట్​ వేశాడు. ఆ ఓవర్​లో మూడో బంతిని వృద్ధిమాన్​ సహా భారీ షాట్​ ఆడేందుకు ప్రయత్నించాడు. దీంతో బంతి.. బ్యాట్​ చివరకు తగిలి అమాంతం గాల్లోకి లేచింది. ఆ బంతిని క్యాచ్​ పట్టడానికి సంజూ శాంసన్, హెట్టీ, జూరెల్​ ప్రయత్నించారు. అందులో ఒకరు కింద పడ్డారు. కానీ వారెవరికీ బంతి దొరకలేదు. అయితే, అందులో ఒకరి చేతిలోంచి మిస్​ అయి కింద పడిపోతుండగా.. దాన్ని బౌల్ట్​ అందుకున్నాడు. దీంతో వృద్ధిమాన్​ సాహా పెవిలియన్ చేరాడు. కాగా, ఈ వీడియోను జియో సినిమా ట్విట్టర్​లో షేర్​ చేసింది. వీడియోతో పాటు క్యాచ్​ పట్టింది ఎవరంటూ.. శాంసన్, హెట్టీ, జూరెల్​ పేర్లు కొట్టేసి.. బౌల్ట్​పేరు పక్కన థండర్​ సింబల్​ జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్​ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

Last Updated : Apr 16, 2023, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.