ETV Bharat / sports

IPL 2023 MI vs GT : సూర్యకుమార్​ ఊచకోత.. బాదుడే బాదుడు - సూర్యకుమార్​ ధనాధన్ ఇన్నింగ్స్​

ఈ ఐపీఎల్ సీజన్​ మొదట్లో ఆటను నెమ్మదిన ప్రారంభించిన సూర్యకుమార్​ యాదవ్​.. ప్రస్తుతం విధ్వంసం సృష్టిస్తున్నాడు. అతడు బాదే షాట్లకు ఏమని పేరు పెట్టాలో కూడా తెలియట్లేదు. అతడి ఆటతీరు గురించే ఈ కథనం..

IPL 2023 MI vs GT  Surya kumar century Innings
IPL 2023 MI vs GT : సూర్యకుమార్​ ఊచకోత.. బాదుడే బాదుడు
author img

By

Published : May 13, 2023, 7:58 AM IST

Updated : May 13, 2023, 8:29 AM IST

బ్యాటింగ్‌ ఇలా కూడా చేస్తారా.. షాట్లు ఇలా కూడా కొడతారా.. అసలు ఈ షాట్లకు ఏమని పేరు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు.. అని అంటున్నారు క్రికెట్ అభిమానులు. అర్థం కాలేదా.. 'స్కై' సూర్యకుమార్‌ యాదవ్‌ ఆటతీరును చూసిన క్రికెట్ ప్రియులందరికీ మదిలో మెదిలిన సందేహాలు ఇవి. దశాబ్దాలుగా క్రికెట్ ఆడిన వారికి.. అలానే క్రికెట్​ను అనుసరిస్తూ ఎన్నో బ్యాటింగ్‌ విన్యాసాలను చూసిన వారికి కూడా.. సూర్య బ్యాటింగ్​ను చూసి ఆశ్చర్యపోతున్నారు. వారికి అతడు బాదే షాట్లు చూస్తుంటే చిత్రాతి చిత్రంగా కనిపిస్తోంది.

'స్కై'కు మాత్రమే సాధ్యం.. వాస్తవానికి క్రికెట్​లో టీ20 ఫార్మాట్​ ఊపందుకున్నాక క్రికెటర్లు స్కూప్‌, ర్యాంప్‌ షాట్లను బాదడం ఎన్నో చూశాం. ఒంటిని విల్లులా వంచుతూ.. క్రీజులో నాట్యం చేస్తూ 360 డిగ్రీల కోణంలో షాట్లు ఆడే డివిలియర్స్‌ ఆటతీరును చూసి.. ఇలాంటోడు ఇంకొకడు రావడం కష్టమే అనుకున్నాం. అసలు అలాంటి ప్లేయర్​ రాడనే అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు సూర్య వచ్చి మిస్టర్​ 360 ప్లేయర్​గా ఊచకోత కోస్తున్నాడు. ఏబీనే మించిన 360 డిగ్రీ ఆటతో.. క్రికెట్‌ మైదానాన్ని హోరెత్తిస్తున్నాడు. సచిన్‌, గంగూలీ లాంటి మాజీ ప్లేయర్స్​.. కోహ్లీ, బట్లర్‌ లాంటి సమకాలీన స్టార్‌ క్రికెటర్లు కూడా.. సూర్య బ్యాటింగ్‌కు ఫిదా అయిపోతున్నారు. వారు ఆశ్చర్యపోతూ.. ఇలా ఆడటం 'స్కై' ఒక్కడికే సాధ్యం అవుతుందని ప్రశంసిస్తున్నారు.

200 స్ట్రైక్​ రేట్​తో ఊచకోత.. అయితే ఆ మధ్యలో అంతర్జాతీయ క్రికెట్​లో కాస్త తడబడి, ఫామ్‌ కోల్పోయిన సూర్య.. ఈ ఐపీఎల్‌ను కూడా నెమ్మదిగానే ప్రారంభించాడు. వరుసగా డకౌట్లు కూడా అయి తీవ్రంగా విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. సోషల్​మీడియాలో అతడిపై ఫుల్ ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ ఇప్పుడతడు లయ అందుకున్నాక.. అతడిని ఆపడం ప్రత్యర్థులకు కష్టమవుతోంది. ఈ మెగాలీగ్​ మొదట్లో డకౌట్లుగా వెనుదిరిగిన అతడు.. తన చివరి ఆరు ఇన్నింగ్స్​లో 57 (26 బంతుల్లో), 23 (12), 55 (29), 66 (31), 26 (22), 83 (35).. ధనాధన్ బాదాడు. దాదాపు 200 స్ట్రైక్‌ రేట్‌తో ప్రత్యర్థుల బౌలింగ్‌ను ఊచకోత కోశాడు.

చివరి 15 బంతుల్లో విధ్వంసం.. శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్​పై జరిగిన మ్యాచ్​లో.. సూర్య చివరి వరకు ఉంటే 60-70 మధ్య స్కోరు చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ సూర్య(103 నాటౌట్‌; 49 బంతుల్లో 11×4, 6×6) మరింత రెచ్చిపోయాడు. 49 బంతుల్లోనే సెంచరీ కొట్టి విధ్వంసం సృష్టించాడు. ప్రేక్షకుల చేత ఔరా అనిపించాడు. అతడితే ఇదే తొలి ఐపీఎల్‌ శతకం. కానీ ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే సూర్య హాఫ్​ సెంచరీ చేసింది 17వ ఓవర్లో. ఆ ఓవర్​ అయ్యేసరికి 53 పరుగులపై వరకు చేసిన అతడు.. ఇన్నింగ్స్‌ చివరి బంతికి శతకం బాది అభివాదం చేశాడు. 4, 4, 0, 6, 2, 4, 6, 4, 0, 4, 2, 0, 6, 2, 6.. చివరి 15 బంతుల్లో విధ్వంసం సృష్టించాడు. దీంతో 14 ఓవర్లలో 139/3తో ఉన్న ముంబయి.. ఏకంగా 218 పరుగులు చేసింది. చివర్లో ముంబయి 6 ఓవర్లలో 79 పరుగులు చేసింది. అందులో సూర్య వాటానే 68 కావడం విశేషం. రెండో హాఫ్​ సెంచరీకి అతడు కేవలం 17 బంతులే తీసుకున్నాడు.

మాటల్లో వివరించడం కష్టం.. సూర్య బాదిన కొన్ని షాట్లను చూస్తే షాక్​ అండ్ సర్​ప్రైజ్​ అవ్వాల్సిందే తప్ప.. మాటల్లో వివరించడం కష్టం. ఒకానొక సందర్భంలో సూర్య బ్యాట్‌ను కత్తిలా వాడి.. బంతిని కోస్తున్నట్లుగా బాదిన ఓ షాట్‌కు థర్డ్‌ మ్యాన్‌లో బంతి బౌండరీ దాటేసింది. ఇక ఆ షాట్‌ను స్టాండ్స్‌ నుంచి చూసిన ముంబయి మెంటార్‌ సచిన్‌ తెందుల్కర్.. ​ ఆశ్చర్యపోయాడు. 'కోత కోసినట్లు కొట్టాడు.. బంతి వెళ్లి బౌండరీ అవతల పడింది' అన్నట్లుగా పక్కనున్న చావ్లాకు చూపించాడు.

ఇదీ చూడండి: IPL 2023 : సూర్య వీర విహారం.. గుజరాత్​పై ముంబయి విజయం

Last Updated : May 13, 2023, 8:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.