'ఐపీఎల్ అంటేనే ఇలా ఉంటుంది' అన్నట్టుగా జరిగింది గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్. ప్రతి నిమిషానికి అంచనాలు మారిపోయాయి. ఏ జట్టు గెలుస్తుందో అని ఊహించడం కష్టతరమైంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిని ఈ మ్యాచ్‌లో.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న గుజరాత్ జట్టుకు బ్రేక్ పడింది. తొలి ఓటమితో నిరాశ ఎదురైంది. కోల్‌కతా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ ఛేదనలలో ఒకటిగా నిలిచిపోయింది.
గుజరాత్ నిర్దేశించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని.. కోల్‌కతా జట్టు ఆఖరు వరకు పోరాడి 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్ (83) పరుగలతో దంచికొట్టాడు. 8 ఫోర్లు, 5 సిక్సులతో చెలరేగిపోయాడు. ఇక యంగ్ బ్యాటర్ రింకు సింగ్ (48*) విజృంభించి జట్టును విజయ తీరాలకు నడిపించాడు. చివరి రెండు బంతుల్లో 10 పరుగుల చేయాల్సి ఉండగా.. రెండు సిక్సులు బాదాడు. నితీశ్ రాణా(45) పరుగులతో రాణించాడు. ఓపెనర్లు గుర్బజ్(15), జగదీశన్(6) పేలవ ప్రదర్శన చేశారు.
ఇంపాక్ట్ చూపిస్తున్న 'ఇంపాక్ట్ ప్లేయర్'..
ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటిసారి 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ తీసుకొచ్చింది బీసీసీఐ. ప్రస్తుతం దాని ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు జరిగితే ఇంపాక్ట్ ప్లేయర్ అంతగా ప్రభావం చూపించలేదు. బౌలింగ్ విభాగంలో ఇంపాక్ట్ ప్రభావం ఉన్నా.. బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా కనిపించలేదు. అయితే, తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రం తొలిసారి బ్యాటింగ్‌లో వెంకటేశ్ అయ్యర్‌ను ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా సరైన సమయంలో వాడింది. దీంతో చెలరేగిన పోయిన వెంకటేశ్.. 83 పరుగులు బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
రింకూ సింగ్ విధ్వంసం.. జస్ట్ రికార్డ్ మిస్!
కోల్‌కతా సాధించిన సంచలన విజయంలో.. రింకూ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరి ఓవర్లో ఈ ప్లేయర్ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు విధ్వంసకర ప్రదర్శన చేశాడు. సిక్స్‌లు కొట్టాడిలా..
-
Never Ever Give Up. Just wait for your time.#RinkuSingh pic.twitter.com/5EpzOMFH9Z
— Awanish Sharan (@AwanishSharan) April 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Never Ever Give Up. Just wait for your time.#RinkuSingh pic.twitter.com/5EpzOMFH9Z
— Awanish Sharan (@AwanishSharan) April 9, 2023Never Ever Give Up. Just wait for your time.#RinkuSingh pic.twitter.com/5EpzOMFH9Z
— Awanish Sharan (@AwanishSharan) April 9, 2023
టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. బ్యాటర్ విజయ్ శంకర్ 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. సాయి సుదర్శన్ (53), శుభ్‌మన్ గిల్ (39) కూడా రాణించారు. వృద్ధిమాన్ సాహా (17), అభినవ్ మనోహర్ (14) పరుగులు చేశారు. ఇక, కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ (3) వికెట్లు పడగొట్టి ఆకట్టుకోగా.. సుయాశ్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు