ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది. చెన్నై బ్యాటర్లు మొదటి నుంచే ఆధిపత్యం కొనసాగించారు. ఓపెనర్‌గా దిగిన డేవన్ కాన్వే (77) దంచికొట్టాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (37) పరుగులు చేసి రాణించాడు. అజింక్య రహానే (9) పరుగులకే పెవిలియన్ చేరాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో మయాంక్ మార్కండే (2) వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 134 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (34) రాణించాడు. ఓపెనర్ హ్యారీ బ్రూక్ (18), త్రిపాఠి (21), క్లాసెన్ (17), జాన్సెన్ (17) ఫర్వాలేదనిపించారు. మార్క్రమ్ (12), మయాంక్ అగర్వాల్ (2), వాషింగ్టన్ సుందర్ (9) పరుగులు చేశారు. ఓపెనర్లు హ్యారీ బ్రూక్, అభిషేక్ మంచి స్టార్ట్ అందించినా.. తర్వాత వచ్చిన బ్యాటర్లు స్కోర్ బోర్డును పరుగెత్తించలేక పోయారు. చెన్నై బౌలర్ల ధాటికి ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. దీంతో నిర్ణీత ఓవర్లలో తక్కువ స్కోరుకే సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ముగించారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా (3) వికెట్లు తీసి అదరగొట్టాడు. ఆకాశ్ సింగ్, తీక్షణ, మతీశ పతిరణ ఒక్కో వికెట్ పడగొట్టారు.
సన్‌రైజర్స్ ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడి.. నాలుగింట్లో బోల్తా కొట్టింది. 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానానికి పరిమితమైంది. వరుస విజయాలతో ఊపుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో గెలుపొంది.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
చెన్నై తుది జట్టు : రుతురాజ్ గైక్వాడ్, డేవన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎమ్ఎస్ ధోనీ (కెప్టెన్ & వికెట్ కీపర్), మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సింగ్, మతీశా పతిరానా
హైదరాబాద్ తుది జట్టు : హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్