ETV Bharat / sports

GT vs SRH : శతక్కొట్టిన గిల్.. గుజరాత్‌ ప్లేఆఫ్స్‌కు.. సన్‌రైజర్స్‌ ఇంటికి

IPL 2023 GT vs SRH : ఐపీఎల్‌-16లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కథ ముగిసింది. ఆల్‌రౌండ్‌ జోరుతో తొమ్మిదో విజయాన్ని ఖాతాలో వేసుకున్న గుజరాత్‌ టైటాన్స్‌ ఈ సీజన్‌లో ప్లేఆప్స్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది.

Gujarat Titans vs Sunrisers Hyderabad
Gujarat Titans vs Sunrisers Hyderabad
author img

By

Published : May 15, 2023, 11:02 PM IST

Updated : May 16, 2023, 6:17 AM IST

IPL 2023 GT vs SRH : ఐపీఎల్​లో 16వ సీజన్​లో భాగంగా సోమవారం గుజరాత్​ టైటాన్స్​, సన్​రైజర్స్​​ హైదరాబాద్​ మధ్య మ్యాచ్​ జరిగింది. ఈ పోరులో 34 పరుగుల తేడాతో గుజరాత్‌ విజయం సాధించింది. హార్దిక్ సేన నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్​రైజర్స్.. ​ 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. షమి (4/21), మోహిత్‌ శర్మ (4/28) ధాటికి కుప్పకూలింది. క్లాసెన్‌ 64 పరుగులు మినహా ఒక్క బ్యాటర్‌ కూడా చెప్పుకోదగిన పరుగులు చేయలేదు. ఈ ఓటమితో హైదరాబాద్‌ జట్టు.. ప్లేఆఫ్‌ అవకాశాలను పూర్తిగా చేజార్చుకుంది. ఇక హైదరాబాద్​పై విజయంతో ఈ సీజన్​లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది గుజరాత్‌. ఇప్పటివరకూ ఆడిన 13 మ్యాచ్‌లలో.. 9 విజయాలు సాధించడం సహా పాయింట్ల పట్టికలో.. అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఛేధనకు దిగన సన్​రైజర్స్​ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్లు ఇద్దరూ పేలవ ప్రదర్శన చేశారు. అన్​మోల్​ ప్రీత్​సింగ్ (5), అభిషేక్​ శర్మ (5) పరుగులకే పెవిలయన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన ఎయిడెన్ మార్​క్రమ్​ మాయ చేస్తాడనుకుంటే.. అతడు కూడా విఫలమయ్యాడు. కేవలం 10 పరుగులే చేసి ఔట్​ అయ్యాడు. రాహుల్​ త్రిపాఠి (1) అందరిబాటలోనే నడిచాడు. సన్​విర్ సింగ్ (7), అబ్దుల్​ సమద్​ (4) పరుగులు చేసి వెనుదిరిగారు. క్లాసెన్ (64; 44 బంతుల్లో 4×4, 3×6) పోరాటం ఏమాత్రం సరిపోలేదు. మార్కో జాన్​సెన్ (3) పరుగులు చేశాడు. భువీ (18) పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్​ షమీ, మోహిత్ శర్మ చెరో 4 వికెట్లు తీసి చెలరేగారు. యశ్​ దయాల్ 1 వికెట్ తీశాడు.

అంతకుముందు, టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన గుజరాత్ జట్టు.. . శుభ్‌మన్‌ గిల్‌ (101; 58 బంతుల్లో 13×4, 1×6) శతక్కొట్టడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది చేసింది. ఓపెనర్​ వృద్ధమాన్​ సాహా ఘోరంగా విఫలమయ్యాడు. 3 బంతులు ఎదుర్కొని డకౌట్​ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శుభమన్​ గిల్​ (101) సెంచరీతో మెరిశాడు. గిల్​కు తోడుగా సాయి సుదర్శన్​ (47, 36 బంతుల్లో 6x4,1x6) కూడా చితక్కొట్టాడు . ఈ ఇద్దరూ తప్ప మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సింగిల్​ డిజిట్​ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఇక సన్​రైజర్స్ హైదారాబాద్​ బౌలర్లలో భువనేశ్వర్ 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 5 వికెట్లతో మెరిశాడు. మార్కో జాన్​సెన్, ఫజల్లా ఫరూకీ, టి నటరాజన్ తలో వికెట్​ పడగొట్టారు.

గిల్​ తొలి సెంచరీ..
ఐపీఎల్​లో గుజరాత్​ స్టార్​ బ్యాటర్​ శుభ్‌మన్ గిల్ తొలి సెంచరీ బాదాడు. ఈ ఘనత సాధించిన తొలి గుజరాత్ టైటన్స్ ప్లేయర్ గా గిల్ రికార్డు నమోదు చేశాడు. ఇదే సీజన్​లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్​పై 94 పరుగుల దగ్గర ఆగిపోయిన గిల్.. ఈసారి శతక్కొట్టాడు. 56 బంతుల్లోనే సెంచరీ చేసిన గిల్.. 58 బంతుల్లో 101 పరుగులు బాదాడు.

Last Updated : May 16, 2023, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.