ETV Bharat / sports

IPL 2023 RCB vs DC : చెలరేగిన ఫిలిప్​ సాల్ట్​.. దిల్లీ బంపర్​ విక్టరీ - virat kolhi records

IPL 2023 RCB vs DC : ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ 2023​లో భాగంగా దిల్లీ, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్​ జరిగింది. దిల్లీ ఓపెనర్ ఫిలిప్​ సాల్ట్​ (87) చెలరేగిపోయాడు. 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది.

IPL 2023 RCB vs DC result
IPL 2023 RCB vs DC result
author img

By

Published : May 6, 2023, 11:05 PM IST

Updated : May 7, 2023, 10:36 AM IST

IPL 2023 RCB vs DC : ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ 2023​లో భాగంగా దిల్లీ, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్​ జరిగింది. ముంబయి నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దీల్లీ 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. 16.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఛేసింగ్​ పూర్తి చేసింది. మొదటి నుంచి దిల్లీ జట్టు ఆధిపత్యం కనబర్చింది. ఓపెనర్ ఫిలిప్​ సాల్ట్​ (87) చెలరేగిపోయాడు. డేవిడ్ వార్నర్​​ (22), మిచెల్​ మార్ష్​ (26), రోస్సో (35), అక్షర్​ పటేల్​ (8) పరుగులు చేశారు. ఇక, బెంగళూరు బౌలర్లలో హేజిల్​వుడ్​, కార్న్​ శర్మ, హర్షల్​ పటేల్​ ఒక్కో వికెట్​ పడగొట్టారు.

మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన బెంగళూరుకు దక్కిన ఆరంభాన్ని బట్టి చూస్తే ఆ జట్టు 200 మార్కును చేరుకుంటుందనిపించింది. అయితే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులను మాత్రమే స్కోర్​ చేయగలిగింది. ఓపెనర్​ విరాట్​ కోహ్లీ ( 46 బంతుల్లో 55), కెప్టెన్​ డుప్లెసిస్​ (32 బంతుల్లో 55) దంచికొట్టారు. ఇద్దరూ వికెట్లు కాపాడుకుంటూనే ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేను ఆర్సీబీ 51/0తో ముగించింది.ఆ తర్వాత స్కోరు వేగం కొంచెం తగ్గినప్పటికీ 10 ఓవర్లకు 79/0తో ఆ జట్టు పటిష్ట స్థితిలోనే కనిపించింది. అర్ధశతకం తర్వాత 16వ ఓవర్లో కోహ్లి వెనుదిరిగినా.. లొమ్రార్‌ జోరుతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మ్యాచ్​ ప్రారంభం నుంచి దిల్లీ బౌలర్లపై ఆధిపత్యం కనబరిచారు. ఆ తర్వాత వచ్చిన మాక్స్​వెల్​ మాత్రం ఖాతా తెరవకుండానే వెనుగదిరిగాడు. అనంతరం వచ్చిన లామ్​రోర్​ ( 29 బంతుల్లో 54*) పరుగులతో మేరుపు షాట్లు ఆడాడు. కార్తీక్​ (11), అనుజ్​ రావత్​ (8*) ఫర్వాలేదనిపించారు. ఇక, దిల్లీ బౌలర్లలో మిచెల్​ మార్ష్​ (2) వికెట్లు తీయగా.. ముకేశ్​ కుమార్​, ఖలీద్​ అహ్మద్​ ఒక్కో వికెట్ పడగొట్టారు.

కోహ్లీ@7000..
ఐపీఎల్‌లో బెంగళూరు ప్లేయర్​ విరాట్‌ కోహ్లి మరో మైలురాయిని దాటాడు. 7000 పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి ఏడువేల పరుగులు మార్క్‌ను చేరుకున్నాడు. విరాట్​ 233 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఈ ప్లేయర్​ ఖాతాలో ఐదు శతకాలు, 49 అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్​ తర్వాతి ప్లేస్​లో శిఖర్‌ ధావన్‌ (6536), డేవిడ్‌ వార్నర్‌ (6189), రోహిత్‌ శర్మ (6063) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.

Last Updated : May 7, 2023, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.