IPL 2022 RR Vs RCB: ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో బెంగళూరు 115 పరుగులకే ఆలౌటైంది. దీంతో 29 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది. డుప్లెసిస్ (23) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 9, రాజత్ పాటిదార్ 16, షాహ్‌బాజ్ అహ్మద్ 17, వహిండు హసరంగ 18, దినేశ్ కార్తిక్ 6, సిరాజ్ 5, హర్షల్ పటేల్ 7 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో కుల్‌దీప్ సేన్ 4, రవిచంద్రన్ అశ్విన్ 3, ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఎనిమిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. బెంగళూరుకు 145 పరుగులను నిర్దేశించింది. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆరంభంలో పరుగులు చేసేందుకు రాజస్థాన్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. లోయర్ ఆర్డర్‌లో రియాన్ పరాగ్ (56*) అద్భుత అర్ధ శతకం సాధించాడు. అయితే పరాగ్‌తోపాటు సంజూ శాంసన్ (27) అశ్విన్ (17), డారిల్ మిచెల్ (16) ఫర్వాలేదనిపించడం వల్ల రాజస్థాన్ ఓ మోస్తరు స్కోరును చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, హేజిల్‌వుడ్, హసరంగ తలో రెండేసి వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ ఒక వికెట్ తీశాడు.
ఇవీ చదవండి:
కార్తీక్‌ను అడ్డుకునేందుకు రాజస్థాన్ ప్లాన్.. కోహ్లీపై ఫ్యాన్స్ ఆశలు