RR vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మంగళవారం మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దూకుడుగా ఆడుతూ విజయాలు సాధిస్తున్న రాజస్థాన్ రాయల్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. వాంఖడే స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన ఆర్సీబీ.. రాజస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
తుది జట్లు: తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి రాజస్థాన్, బెంగళూరు.
రాజస్థాన్: జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కెప్టెన్/కీపర్), శిమ్రన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవ్‌దీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తిక్ (కీపర్), ఎస్ రూథర్ ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, అకాష్ దీప్, మహ్మద్ సిరాజ్
ఇదీ చూడండి: టీమ్‌ఇండియాకు ఎంపికవ్వకుండానే.. ఊపుఊపేస్తున్న కుర్రాళ్లు