ETV Bharat / sports

దిల్లీకి కష్టాలు.. ఆ ముగ్గురి కోసం ఎదురుచూపులు - ipl delhi capitals

Nortje David Warner: స్టార్​ ప్లేయర్లు అందుబాటులో లేక.. ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ అనుకున్నంతగా రాణించలేకపోతుంది. తొలి మ్యాచ్​లో గెలిచినప్పటికీ.. రెండో మ్యాచ్​లో గుజరాత్​ టైటాన్స్​ చేతిలో పరాజయం పాలైంది. అయితే.. డేవిడ్​ వార్నర్​, అన్రిచ్​ నోర్జే, మిచెల్​ మార్ష్​ అతి త్వరలో అందుబాటులోకి వస్తారని ఆశిస్తున్నట్లు హెడ్​ కోచ్​ పాంటింగ్​ తెలిపాడు.

Ricky Ponting expects Anrich Nortje,
Ricky Ponting expects Anrich Nortje,
author img

By

Published : Apr 3, 2022, 9:23 AM IST

Nortje David Warner: ఐపీఎల్​-15ను దిల్లీ క్యాపిటల్స్​ విజయంతోనే ప్రారంభించింది. తొలి మ్యాచ్​లో ముంబయిపై గెలిచినా.. రెండో మ్యాచ్​లో గుజరాత్​ టైటాన్స్​ చేతిలో ఓడిపోయింది. అయితే.. దిల్లీ క్యాపిటల్స్​ జట్టులో కీలక విదేశీ ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం వల్ల వారి బ్యాటింగ్​, బౌలింగ్​ విభాగాలు బలహీనంగా మారాయి. బ్యాటింగ్​లో ఓపెనర్లు పృథ్వీ షా, సీఫెర్ట్​ ఆకట్టుకోలేకపోతున్నారు. జట్టులో లలిత్​ యాదవ్​, పంత్​, అక్షర్​ పటేల్​ మాత్రమే ఫర్వాలేదనిపిస్తున్నారు. బౌలింగ్​లో నోర్జే లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అంతకుముందు సీజన్లో రబాడ, నోర్జే, అవేశ్​ ఖాన్​, అక్షర్​, అశ్విన్​తో బౌలింగ్​ దుర్బేధ్యంగా ఉండేది. ఇప్పుడు అవేశ్​, అశ్విన్​, రబాడ వేరే జట్లకు ఆడుతున్నారు.

నెక్ట్స్​ మ్యాచ్​కు వస్తారని..: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​, సౌతాఫ్రికా పేసర్​ అన్రిచ్​ నోర్జే.. దిల్లీ ఆడే తదుపరి మ్యాచ్​కు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నట్లు హెడ్​ కోచ్​ రికీ పాంటింగ్​ అన్నాడు. ఫిట్​నెస్​ సమస్యలను పరిష్కరించుకొని.. మిచెల్​ మార్ష్​ కూడా త్వరలోనే జట్టులో చేరతాడని భావిస్తున్నట్లు తెలిపాడు. గతేడాది నవంబర్​ నుంచి అంతర్జాతీయ క్రికెట్​ ఆడలేదు నోర్జే. అతడిని వెన్నునొప్పి సమస్య వేధిస్తోంది. అయితే.. నెట్స్​లో బాగానే బౌలింగ్​ చేస్తున్నాడని పాంటింగ్​ చెప్పుకొచ్చాడు.

కాంట్రాక్టు ఉన్న ఆస్ట్రేలియా ప్లేయర్లు ఐపీఎల్​లో ఏప్రిల్​ 6 తర్వాతే ఆడేందుకు అనుమతి ఇచ్చింది అక్కడి బోర్డు. దీని కారణంగా వార్నర్​, మిచెల్​ మార్ష్​.. ప్రస్తుతం ఆడలేకపోతున్నారు. ఏప్రిల్​ 7న దిల్లీ క్యాపిటల్స్​​.. లఖ్​నవూతో తలపడనుంది. ఆ మ్యాచ్​కు వార్నర్​ ఆడే అవకాశం ఉన్నట్లు పాంటింగ్​ చెప్పాడు. మార్ష్​ ఆ తర్వాతి మ్యాచ్​కు జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. వార్నర్​, మార్ష్​ వీలైనంత త్వరగా క్వారంటైన్​ కూడా పూర్తి చేసుకొని.. సెలక్షన్​కు అందుబాటులోకి వస్తారని పాంటింగ్​ వెల్లడించాడు.

ఇవీ చూడండి: 'ఆ 35 పరుగులే నాకు అత్యుత్తమం'- 11 ఏళ్లు వెనక్కి వెళ్లిన కోహ్లీ

'కేన్​' అవుట్​పై సన్​రైజర్స్​ నిరసన.. బీసీసీఐకి చేరిన పంచాయతీ

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.