ETV Bharat / sports

లివింగ్​స్టోన్​ మెరుపులు.. ధావన్ రికార్డు.. గుజరాత్​ లక్ష్యం ఎంతంటే? - ipl live score 2022 today

IPL 2022: గుజరాత్​ టైటాన్స్​తో మ్యాచ్​లోనూ అర్ధశతకంతో చెలరేగిపోయాడు పంజాబ్ కింగ్స్ ఆల్​రౌండర్ లివింగ్​స్టోన్. దీంతో గుజరాత్​ ముందు 190 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది పంజాబ్.

IPL 2022
pbks vs gt
author img

By

Published : Apr 8, 2022, 9:27 PM IST

IPL 2022: గుజరాత్​ టైటాన్స్​తో మ్యాచ్​లో మరోసారి రెచ్చిపోయాడు పంజాబ్ కింగ్స్​ ఆల్​రౌండర్ లియామ్ లివింగ్​స్టోన్. 27 బంతుల్లోనే 64 బాదాడు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​ నిర్ణీత 20 ఓవర్లలో 189/9 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (35), జితేశ్ శర్మ (23) రాణించారు. కెప్టెన్​ మయాంక్ అగర్వాల్ మరోసారి విఫలం కాగ, మిగిలిన బ్యాటర్లు కూడా నిరాశ పరిచారు. ఆఖర్లో రాహుల్ చాహర్ (22) మెరిశాడు. దీంతో గుజరాత్​కు 190 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది పంజాబ్.

గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, దర్శన్ నాల్కండే 2, హార్దిక్, ఫెర్గూసన్, షమీ తలో వికెట్ పడగొట్టారు.

ధావన్ అరుదైన రికార్డు..

ఈ మ్యాచ్​లో నాలుగు ఫోర్లు బాదిన డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో వెయ్యి ఫోర్లు బాదిన తొలి భారత క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు. మొత్తంగా ప్రపంచ క్రికెట్​లో ఈ మైలురాయిని చేరుకున్న 5వ ప్లేయర్​గా నిలిచాడు గబ్బర్. ఈ జాబితాలో ధావన్​కు చేరువలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (914 ఫోర్లు) ఉన్నాడు.

ఇదీ చూడండి: మయాంక్.. నువ్వు కెప్టెన్‌వనే విషయం మర్చిపో: సెహ్వాగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.