IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్. లఖ్‌నవూ ఓపెనర్ క్వింటన్ డికాక్ (80) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బ్యాటర్లలో పృథ్వీ షా (61), పంత్ (39*), సర్ఫరాజ్ ఖాన్ (36*) రాణించారు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2, కృష్ణప్ప గౌతమ్ ఒక వికెట్ పడగొట్టారు
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ జట్టు బ్యాటర్లు నిలకడగా ఆడుతూ 4 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో ఛేదించారు. బ్యాటింగ్‌లో డికాక్ (80) దంచికొట్టాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (24), ఎవిన్ లూయిస్ (5), దీపక్ హుడా (11) నిరాశపరచగా.. కృనాల్ పాండ్య (19*), బదోనీ (11*) నాటౌట్‌గా నిలిచారు. దిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, లలిత్ యాదవ్, శార్దూల్ ఒక్కో వికెట్ తీశారు.
ఇదీ చదవండి: జడ్డూ ఏదైనా చేయగలడు.. వైరల్ అవుతున్న వీడియో