ETV Bharat / sports

KKR vs PBKS: విజృంభించిన ఉమేశ్​.. కోల్​కతా లక్ష్యం ఎంతంటే?

author img

By

Published : Apr 1, 2022, 9:16 PM IST

KKR vs PBKS: పంజాబ్​తో జరుగుతున్న మ్యాచ్​లో కోల్​కతా బౌలర్లు రెచ్చిపోయారు. ఉమేశ్ యాదవ్​ నాలుగు వికెట్లతో చెలరేగిన వేళ 137 పరుగులకే పరిమితమైంది పంజాబ్.

kkr vs pbks
ipl 2022

KKR vs PBKS: కోలకతాతో వాంఖడే స్టేడియం వేదికగా జరగుతున్న మ్యాచ్​లో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది పంజాబ్. ఆ జట్టును ఉమేశ్​ యాదవ్ (4 వికెట్లు) దెబ్బతీశాడు. తొలి ఓవర్లోనే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (1)​ పెవిలియన్​ చేరగా.. ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయింది పంజాబ్. భానుక రాజపక్స (31) స్కోరు బోర్డును పరుగులు పెట్టించినా.. ఆ మెరుపులు ఎక్కువ సేపు కొనసాగలేదు. చివర్లో కగిసో రబాడ (25) కాస్త ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారు.

కోల్​కతా బౌలర్లలో ఉమేశ్​ యాదవ్ 4, టిమ్ సౌథీ 2, శివం మావి, సునీల్ నరైన్, ఆండ్రీ రసెస్ తలో వికెట్ తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.