IPL 2022 GT Vs LSG: మెగా టీ20 టోర్నీలో ప్లేఆఫ్స్‌కి ముందట లఖ్‌నవూకు గుజరాత్ మరోసారి షాకిస్తూ పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది. ఫలితంగా ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచుల్లో తొమ్మిదింటిలో గెలిచి హార్దిక్ సేన అధికారికంగా తొలి ప్లేఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 145 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ 13.5 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. లఖ్‌నవూ బ్యాటర్లలో దీపక్ హుడా (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో డికాక్ (11), కేఎల్ రాహుల్ (8), కరన్ శర్మ (4), కృనాల్ పాండ్య (5), ఆయుష్ బదోని (8), స్టొయినిస్ (2), హోల్డర్ (1), మోసిన్ ఖాన్ (1), అవేశ్ ఖాన్ (12) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్‌ఖాన్ 4, యశ్ దయాల్ 2, సాయి కిషోర్ 2, షమి 1 వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్.. నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ శుభమన్ గిల్ (63*; 49 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధ శతకంతో మెరిశాడు. డేవిడ్ మిల్లర్ (26) ఫర్వాలేదనిపించాడు. గుజరాత్ మిగతా బ్యాటర్లలో వృద్ధిమాన్ సాహా (5), మథ్యూ వేడ్ (10), హార్దిక్ పాండ్య (11) పరుగులు చేశారు. రాహుల్ తెవాతియా (22) నాటౌట్‌గా నిలిచాడు. లఖ్‌నవూ బౌలర్లలో అవేశ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మోసిన్ ఖాన్, హోల్డర్ తలో వికెట్ తీశారు.
ఇదీ చదవండి: IPL 2022: కళ్లు చెదిరే బౌలింగ్.. బ్యాటర్లు హడల్.. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనలివే..