ETV Bharat / sports

సన్​రైజర్స్​ బౌలర్స్​ అదుర్స్​.. చెన్నై తక్కువ స్కోరుకే.. - చెన్నై సూపర్​ కింగ్స్​ వర్సెస్​ సన్​రైజర్స్​ హైదరాబాద్​

CSK vs SRH: సన్​రైజర్స్​ హైదరాబాద్​ బౌలర్లు చెలరేగిన వేళ.. చెన్నై సూపర్​ కింగ్స్​ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేసింది.

CSK vs SRH
CSK vs SRH
author img

By

Published : Apr 9, 2022, 5:25 PM IST

CSK vs SRH: ఐపీఎల్​లో శనివారం సన్​రైజర్స్​ హైదరాబాద్​తో మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. మొయిన్​ అలీ 48 (35 బంతుల్లో) టాప్​ స్కోరర్​. రాయుడు(27), జడేజా(23) మోస్తరుగా రాణించారు. సన్​రైజర్స్​ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయగా.. చెన్నై బ్యాటర్లు తేలిపోయారు. నటరాజన్​, వాషింగ్టన్​ సుందర్​ చెరో రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్​, మార్కో జాన్సెన్​, మార్​క్రమ్​ తలో వికెట్​ తీశారు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన చెన్నైకి సరైన ఆరంభం దక్కలేదు. పవర్​ప్లేలోనే రాబిన్​ ఉతప్ప(15), రుతురాజ్​ గైక్వాడ్​(16) వికెట్లను కోల్పోయింది. ఫామ్​లో ఉన్న శివం దూబే(3), ధోనీ(3) విఫలమయ్యారు. ఈ మ్యాచ్​ కోసం రెండు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగాయి. చెన్నైలో ప్రిటోరియస్​ స్థానంలో మహేశ్​ తీక్షణ జట్టులోకి వచ్చాడు. సన్​రైజర్స్​లో సమద్​, షెఫర్డ్​ స్థానంలో శశాంక్​ సింగ్​, మార్కో జాన్సెన్​ ఈ మ్యాచ్​లో ఆడారు.

ఇవీ చూడండి: కొరియా ఓపెన్​లో సింధు, శ్రీకాంత్​కు నిరాశ.. సెమీస్​లో ఓటమి

అప్పుడు ధోనీ.. ఇప్పుడు తెవాతియా.. 2 బంతుల్లో రెండు సిక్సర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.