రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌పై.. నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. శాంసన్ సారథిగా ఉండడం టీమ్ సహచరులకు ఇష్టం లేదని తాను భావిస్తున్నట్లు తెలిపాడు.
"ఆటగాడిగా ఉన్న ఓ క్రికెటర్ కెప్టెన్‌గా తనను తాను మార్చుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఫీల్డింగ్‌లో ఆ జట్టు సమన్వయంతో కనిపించడం లేదు. బౌలర్ ఓ ఓవర్ చెత్తగా వేస్తే.. సారథిగా ఉన్న వ్యక్తి అతడితో మాట్లాడాలి. అతడిపై నమ్మకం వ్యక్తం చేయాలి. రిషభ్ పంత్ ఇలా చేయడం నేను చూశాను. కానీ, శాంసన్ ఇలా వ్యవహరించడం లేదు. బహుశా అతడు సారథిగా ఉండడం ఆ జట్టులో ఎవరికీ ఇష్టం లేనట్లుంది."
-వీరేంద్ర సెహ్వాగ్, భారత మాజీ క్రికెటర్.
'బ్యాటింగ్‌లోనూ రాజస్థాన్ జట్టుది ఇదే వైఖరి. విదేశీ ఆటగాళ్లు.. అందరితో కలివిడిగా ఉండట్లేదు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగోలేదు. వారొక జట్టుగా వ్యవహరించడం లేదు' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
ఇప్పటివరకు 5 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ రెండు మ్యాచ్‌లు నెగ్గింది. తొలి మ్యాచ్‌లో గెలుపు అంచు వరకు వచ్చి పరాజయం పాలైంది. స్టార్ ఆటగాళ్లు జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ గాయాల కారణంగా ఆటకు దూరమయ్యారు. దీంతో మ్యాచ్ విన్నర్లు ఎవరనే విషయంపై ఆ టీమ్ మథనపడుతోంది. తన తదుపరి మ్యాచ్‌లో ముంబయితో ఆడనుంది రాజస్థాన్. కొత్త కెప్టెన్ మార్గదర్శకత్వంలో ఈ సారైనా రాజస్థాన్ తలరాత మారుతుందేమోనని ఫ్రాంఛైజీ ఆశగా ఎదురుచూస్తోంది.
ఇదీ చదవండి: మీరే కెప్టెన్లా ముందుండి నడిపించాలి: కోహ్లీ