ETV Bharat / sports

ఆర్సీబీపై ట్రోలింగ్.. చెన్నై జెర్సీలో కోహ్లీ! - ఐపీఎల్ సీఎస్కే

ట్విట్టర్​లో జరిగిన చిన్న పొరపాటు వల్ల పలువురు నెటిజన్లు.. బెంగళూరు జట్టుపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చెన్నై జెర్సీ వేసుకున్న కోహ్లీ ఫొటోను పోస్ట్ చేశారు.

CSK jersey emoji for RCB
ఆర్సీబీపై ట్రోలింగ్.. చెన్నై జెర్సీలో కోహ్లీ!
author img

By

Published : Apr 3, 2021, 3:57 PM IST

త్వరలో ఐపీఎల్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో అభిమానులు మధ్య సందడి నెలకొంది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ట్విట్టర్,​ సరికొత్త అప్​డేట్​ను నెటిజన్ల ముందుకు తీసుకొచ్చింది. ఏదైనా జట్టు గురించి ట్విట్టర్​లో సెర్చ్​ చేస్తే, జెర్సీ ఏమోజీ కూడా దాని పక్కనే వస్తుంది. దీంతో కోహ్లీ, చెన్నై జెర్సీ వేసుకున్న ఫొటోను పలువురు ట్వీట్ చేయడం విశేషం.

CSK jersey emoji for RCB
ట్విట్టర్​లో ఐపీఎల్​ జట్ల ఏమోజీలు

ఆర్సీబీపై ట్రోలింగ్!

ఈ క్రమంలో అన్ని జట్లకు ఏమోజీలు సరిగా ఉన్నప్పటికీ ఆర్సీబీ అని టైప్​ చేస్తుంటే చెన్నై సూపర్​కింగ్స్​ ఏమోజీ చూపిస్తోంది. దీనిపై పలువురు నెటిజన్లతో పాటు సీఎస్క్​ అధికారిక ట్విట్టర్​ కూడా కోహ్లీసేనపై హాస్యభరిత ట్రోలింగ్ చేసింది.

CSK jersey emoji for RCB
ట్విట్టర్​లో ఆర్సీబీకి చెన్నై ఏమోజీ

చెన్నై-బెంగళూరు మ్యాచ్​లు ఎప్పుడు?

ఈ సీజన్​లో బెంగళూరు-చెన్నై జట్ల మధ్య ఏప్రిల్ 25, మే 23న మ్యాచ్​లు జరగనున్నాయి. ఇప్పటికే ఇరుజట్లు తీవ్రంగా ప్రాక్టీసు చేస్తున్నాయి. ఏప్రిల్ 9న లీగ్​ మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.