ETV Bharat / sports

'సీఎస్కే సిబ్బందికి కరోనా లేదు' - చెన్నై సూపర్​ కింగ్స్ కరోనా నెగటివ్​

ఆదివారం చేసిన వైరస్​ నిర్ధరణ పరీక్షల్లో పాజిటివ్​గా తేలిన చెన్నై సూపర్​కింగ్స్​ సీఈవో కాశీ విశ్వనాథన్‌, బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ సహా మరో సిబ్బందికి సోమవారం చేసిన పరీక్షల్లో నెగటివ్​ వచ్చింది. ఆదివారం వచ్చిన ఫలితాలు తప్పుడు రిపోర్టులని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

csk
సీఎస్కే
author img

By

Published : May 3, 2021, 9:19 PM IST

Updated : May 3, 2021, 9:55 PM IST

దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరోవైపు ఐపీఎల్‌ మ్యాచ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా టోర్నీకి సంబంధించిన పలువురు వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో బయోబబుల్‌ ఏర్పాట్లపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాళ్లు ఇద్దరు, దిల్లీ మైదాన సిబ్బంది ఐదు మందికి తాజాగా కొవిడ్‌-19 నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇదిలా ఉండగా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీఈవో కాశీ విశ్వనాథన్‌, బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ, ఆ ఫ్రాంఛైజీకి చెందిన బస్సు క్లీనర్‌కు సైతం కరోనా సోకిందనే వార్తలు వచ్చాయి.

అయితే, అందులో నిజం లేదని ఓ బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు. ఆదివారం చెన్నై సిబ్బందికి వచ్చిన ఫలితాలు తప్పుడు రిపోర్టులని, సోమవారం వచ్చిన ఫలితాల్లో నెగిటివ్‌గా నిర్ధారణ అయిందని చెప్పారు. దాంతో చెన్నై జట్టులో ప్రస్తుతం ఎవరూ వైరస్‌ బారిన పడలేదని ఆ అధికారి స్పష్టంచేశారు. మరోవైపు కోల్‌కతా జట్టులో వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌ వైరస్‌ బారిన పడటంతో సోమవారం ఆ జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడాల్సిన మ్యాచ్‌ వాయిదా పడింది. దీన్ని టోర్నీ పూర్తయ్యేలోపు మళ్లీ నిర్వహిస్తారని తెలిసింది. అదెప్పుడనేది ప్రస్తుతానికి నిర్ణయించలేదు.

ఇదీ చూడండి: ఐపీఎల్: చెన్నై సూపర్​కింగ్స్​లో ముగ్గురికి కరోనా!

Last Updated : May 3, 2021, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.