సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు మారలేదు. తొలుత బంతితో కట్టడి చేసినా బ్యాటింగ్‌లో మాత్రం చేతులెత్తేసింది. 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఏడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
బ్యాట్స్‌మెన్‌లో జేసన్ హోల్డర్(47; 29 బంతుల్లో 5×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. చివరి బంతికి 7 పరుగులు అవసరం కాగా కేవలం ఒక పరుగు మాత్రమే వచ్చింది. దీంతో హైదరాబాద్ 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఇదీ చదవండి: