చెన్నై వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విధ్వంసం సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగి ఈ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో నబీ, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, భువనేశ్వర్ తలో ఓ వికెట్ పడగొట్టారు.
-
Rana in leading role 😎
— KolkataKnightRiders (@KKRiders) April 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Tripathi in supporting role 🤝
Blockbuster opening innings for KKR in #IPL2021!#KKRHaiTaiyaar #SRHvKKR pic.twitter.com/AdtCkQKEzv
">Rana in leading role 😎
— KolkataKnightRiders (@KKRiders) April 11, 2021
Tripathi in supporting role 🤝
Blockbuster opening innings for KKR in #IPL2021!#KKRHaiTaiyaar #SRHvKKR pic.twitter.com/AdtCkQKEzvRana in leading role 😎
— KolkataKnightRiders (@KKRiders) April 11, 2021
Tripathi in supporting role 🤝
Blockbuster opening innings for KKR in #IPL2021!#KKRHaiTaiyaar #SRHvKKR pic.twitter.com/AdtCkQKEzv
నితీష్ రానా(56 బంతుల్లో 80), శుభ్‌మన్ గిల్ జోడీ తొలి వికెట్‌కు 53 పరుగులు భాగస్వామ్యంతో శుభారంభం చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి(29 బంతుల్లో 53) ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో రానా, త్రిపాఠి హాఫ్ సెంచరీలు చేశారు. వారి బ్యాటింగ్ చూస్తే కోల్‌కతా సునాయాసంగా 200 పరుగులు దాటుతుందనిపించింది. కానీ, చివరిలో వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల 187 పరుగులకే పరిమితమైంది.