ఐపీఎల్లో(IPL 2021) మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 2 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్(RR Vs PBKS) విజయం సాధించింది. టోర్నీ రెండోదశలో తొలిమ్యాచ్ విజయాన్ని ఆస్వాదిస్తున్న రాజస్థాన్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా(Slow Over Rate in IPL) ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌కు(Sanju Samson News) రూ.12 లక్షల జరిమానాను ఐపీఎల్ నిర్వాహకులు విధించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మార్గదర్శకాల(Slow Over Rate Rules in IPL) ప్రకారం లీగ్‌లో తొలిసారి ఓవర్ రేటు నిబంధనలను ఉల్లంఘిస్తే.. సదరు జట్టు కెప్టెన్‌కు రూ.12 లక్షల జరిమానా విధిస్తారు. అదే తప్పు మళ్లీ చేస్తే.. రూ.24 లక్షలతో పాటు తుదిజట్టులోని ప్రతి ఆటగాడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడుతుంది. మూడోసారి ఇదే తప్పు చేస్తే రూ.30 లక్షల జరిమానా సహా మ్యాచ్ నిషేధం.. తుదిజట్టులోని ఆటగాళ్లకు రూ.12 లక్షల జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు.
ఇదీ చూడండి.. PBKS Vs RR: పంజాబ్ ఓటమికి కారణం అతడే!