ఐపీఎల్ 2021(ipl 2021 live) రెండో దశలో భాగంగా నేడు(సెప్టెంబర్ 24) చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(csk vs rcb 2021) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. టాస్కు ముందు ఇసుక తుపాను కాసేపు అంతరాయం కలిగించింది.
సెకండ్ ఫేజ్ తొలి మ్యాచ్(rcb vs kkr 2021)ను ఓటమితో ప్రారంభించిన కోహ్లీసేన ఈ మ్యాచ్లో ఎలాగైన గెలవాలన్న పట్టుదలతో ఉంది. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో కేవలం 92 పరుగులకే ఆలౌటైన ఈ జట్టు చెన్నైపై భారీ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు పటిష్ట ముంబయి జట్టు(mi vs csk 2021)పై అద్భుత విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న ధోనీసేన ఈ మ్యాచ్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్లాలని భావిస్తోంది.
జట్లు
చెన్నై సూపర్ కింగ్స్
గైక్వాడ్, డుప్లెసిస్, మొయిన్ అలీ, రైనా, రాయుడు, రవీంద్ర జడేజా, హెజిల్వుడ్, ధోనీ (కెప్టెన్), బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కోహ్లీ (కెప్టెన్), పడిక్కల్, కేఎస్ భరత్, మ్యాక్స్వెల్, డివిలియర్స్, టిమ్ డేవిడ్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్, సిరాజ్, నవదీప్ సైనీ, చాహల్