ముంబయి ఇండియన్స్-పంజాబ్ కింగ్స్(MI vs PMKS 2021) హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. ప్లే ఆఫ్స్‌లో రేసులో ముందుకు వెళ్లడమే లక్ష్యంగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదటగా టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది.
హెడ్ టూ హెడ్
ఇప్పటివరకు ఐపీఎల్లో ఈ రెండు జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడగా ముంబయి 14 మ్యాచ్‌ల్లో, పంజాబ్ 13 మ్యాచ్‌ల్లో గెలిచాయి.
జట్లు
పంజాబ్ కింగ్స్
రాహుల్ (కెప్టెన్), మన్దీప్ సింగ్, గేల్, మర్క్రమ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హర్‌ప్రీత్ బ్రర్, నాథన్ ఎల్లిస్, షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్
ముంబయి ఇండియన్స్
రోహిత్ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్, సౌరభ్ తివారి, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, నాథన్ కౌల్టర్‌నీల్, రాహుల్ చాహర్, బుమ్రా, బౌల్ట్